Platform 65: హైదరాబాద్‌లో వింత రెస్టారెంట్‌.. రైళ్లే అక్కడ సర్వర్లు.. కూర్చోడానికి సీట్లు ఉండవ్‌..

|

Mar 06, 2023 | 3:15 PM

ట్రైన్‌లో అలా ఫుడ్ తింటూ జర్నీ చేస్తుంటే అదొక అనుభూతి. అయితే రైల్లో ఫుడ్‌ క్యాటరింగ్‌ వాళ్లు ఫుడ్‌ సర్వ్‌ చేస్తారు. కానీ రైలే మీకు భోజనం అందిస్తే... సూపర్‌ కదూ.. అవును రైలే వచ్చి.. మీకు ఆహారాన్ని అందిస్తుంది.

Platform 65: హైదరాబాద్‌లో వింత రెస్టారెంట్‌.. రైళ్లే అక్కడ సర్వర్లు.. కూర్చోడానికి సీట్లు ఉండవ్‌..
Platform 65
Follow us on

Platform 65: రైలు ప్రయాణం ఎవరికైనా ఇష్టమే.. ప్రకృతితో పోటీ పడుతున్నామా అన్నట్లు సాగే ట్రైన్‌ జర్నీని పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఇష్టపడతారు. ఇక ట్రైన్ లో ప్రయాణిస్తూ..తినడం అదొక మంచి అనుభూతి.. దీంతో రైలు ప్రయాణ సమయంలో తినడానికి ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తుంటాం కదా… ఆర్డర్‌ చేసిన గంటకో.. అరగంటకో ఫుడ్‌ వస్తుంది.. నచ్చినా.. నచ్చకపోయినా ఫుడ్‌ తింటాం. ట్రైన్‌లో అలా ఫుడ్ తింటూ జర్నీ చేస్తుంటే అదొక అనుభూతి. అయితే రైల్లో ఫుడ్‌ క్యాటరింగ్‌ వాళ్లు ఫుడ్‌ సర్వ్‌ చేస్తారు. కానీ రైలే మీకు భోజనం అందిస్తే… సూపర్‌ కదూ.. అవును రైలే వచ్చి.. మీకు ఆహారాన్ని అందిస్తుంది. అందుకు మీరు హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ‘ప్లాట్‌ఫామ్‌-65’ రెస్టారెంట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. థీమ్‌ బేస్డ్‌ రెస్టారెంట్లకు పెరుగుతున్న ఆదరణకు ఇదో సాక్ష్యం అని చెప్పొచ్చు. ఇక్కడ టేబుళ్లు, కుర్చీలు.. అన్నీ ట్రైన్‌లో ఉండే సీట్లలాగే ఉంటాయి. అక్కడ కూర్చుంటే మీకు ట్రైన్‌లో కూర్చున్న అనుభూతే కలుగుతుంది.

వరంగల్‌, విశాఖపట్నం, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి గమ్యస్థానాలను స్టేషన్‌ పేర్లతో సహా రూపొందించారు. ఆయా మార్గాల్లోని పట్టణాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, చారిత్రక కట్టడాలను కూడా గోడలపై పెయింట్‌ చేశారు. దీంతో నచ్చిన మార్గాన్ని ఎంచుకుని.. అక్కడ కూర్చోవచ్చు. ఇక వడ్డన విషయానికొస్తే ఈ రెస్టారెంట్లో సర్వర్లకు బదులు బుల్లిబుల్లి ట్రైన్లు మనం ఆర్డర్‌ చేసిన వెరైటీలను తెచ్చి ఇస్తాయి. ఆ అనుభూతిని ఆస్వాదించాలంటే ప్లాట్‌ఫామ్‌–65కు వెళ్లాల్సిందే. ఇద్దరు వ్యక్తులకు 1,000 రూపాయల వరకూ చార్జ్‌ చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..