Hyderabad: సండే రోజు ప్రశాంతత కోసం గుడికి వెళ్తే.. భక్తుడిని చితక్కొట్టిన పూజారి

|

Mar 06, 2022 | 2:37 PM

మనస్సు ప్రశాంతత కోసం గుడికెళ్లిన ఓ భక్తుడికి అవమానం జరిగింది. భక్తుడిపై పూజారి విచక్షణా రహితంగా దాడి చేశాడు. బూతులు తిడుతూ దిక్కున్న చోట చెప్పుకోపో అంటూ రౌడీలా ప్రవర్తించాడు.

Hyderabad: సండే రోజు ప్రశాంతత కోసం గుడికి వెళ్తే.. భక్తుడిని చితక్కొట్టిన పూజారి
Persist Over Action
Follow us on

Telangana: మనస్సు ప్రశాంతత కోసం గుడికెళ్లిన ఓ భక్తుడికి అవమానం జరిగింది. భక్తుడిపై పూజారి విచక్షణా రహితంగా దాడి చేశాడు. బూతులు తిడుతూ దిక్కున్న చోట చెప్పుకోపో అంటూ రౌడీలా ప్రవర్తించాడు. ఈ ఘటన సికింద్రాబాద్(Secunderabad) రేతి ఫైల్ గణేష్ టెంపుల్ లో జరిగింది. ఉప్పల్ బాలాజీ హిల్స్ కి చెందిన వాల్మీకిరావు టెంపుల్‌కి వెళ్లారు. పూజ చేయించుకునే క్రమంలో పూజారికి, వాల్మీకి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన పూజారి అతనిపై దాడి చేశాడు. పూజలు చేయాల్సిన పూజారి గుడిలో బూతులు తిడుతూ దిక్కున చోట చెప్పుకోమని రౌడీలా మారిన వైనం విస్తూపోయేలా చేస్తోంది. ఫిబ్రవరి 27 ఆదివారం రోజున రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  పోలీసులు పూజారి ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసి, ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. నిత్యం దైవానికి దగ్గరిగా ఉండే పూజారి ఈ రకంగా సహనం కోల్పోయి వ్యవహరించడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Telangana: ఆదిలాబాద్ జిల్లాలో వింత.. పాలు తాగుతున్న శివాలయంలోని నంది

కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన 3వ తరగతి బుడ్డోడు.. రీజన్ తెలిస్తే అవాక్కే