Hyderabad: దంచి కొట్టిన వర్షం.. చుక్కలు చూస్తున్న నగరవాసులు.. మరో రెండు రోజులు ఇదే సిచ్యువేషన్..

హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి నగరవాసులు భయాందోళనకు గురయ్యారు. భారీ శబ్ధంతో ఉరుములు రావడంతో పిడుగులు పడ్డాయోమోనని..

Hyderabad: దంచి కొట్టిన వర్షం.. చుక్కలు చూస్తున్న నగరవాసులు.. మరో రెండు రోజులు ఇదే సిచ్యువేషన్..
Hyderabad Rains

Edited By: Phani CH

Updated on: Oct 13, 2022 | 7:59 AM

హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి నగరవాసులు భయాందోళనకు గురయ్యారు. భారీ శబ్ధంతో ఉరుములు రావడంతో పిడుగులు పడ్డాయోమోనని ఆందోళన చెందారు. నగరంలోని మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, టోలిచౌకి, అత్తా పూర్, రాజేంద్ర నగర్, హైదర్ గూడ, శివరాంపల్లి, నార్సింగి, కుత్బుల్లాపూర్, బాలానగర్, జీడిమెట్ల, సికింద్రాబాద్, ముషీరాబాద్, చిక్కడపల్లి బాగ్ లింగం పల్లి లోనూ వాన పడింది. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోలిచౌకి, మెహదీపట్నం మార్గం లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టోలిచౌకి ఫ్లై ఓవర్ వద్ద రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు ముందుకు వెళ్లలేక అవస్థలు ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట, పంజాగుట్ట, హైటెక్ సిటీ, యూసఫ్ గూడ, షేక్ పేట్, గచ్చిబౌలి, ఆర్ సిపురం, రాజేంద్రనగర్, బండ్లగూడ, గొల్కొండ, నార్సింగి, పుప్పాలగూడ, మైలార్ దేవుల పల్లి, మణికొండ, గండిపేట, షాద్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

ఎక్కడిక్కడ నీరు నిల్చిపోవడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరో రెండ్రోజుల పాటు మోస్తరు వర్షాలు పడొచ్చంటూ వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. అత్యవసరమైతేనే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..