Telangana: గ్రూప్ 1 పరీక్ష రాసి ఇంటికి వెళ్తుండగా విషాదం.. మహిళా అభ్యర్ధి మృతి

ఆదివారం జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసి ఇంటికి తిరిగి వెళ్లుండగా ఓ అభ్యర్ధి మార్గం మధ్యలో కన్నుమూసింది. పరీక్ష కేంద్రం నుంచి బైక్‌పై వెళ్తున్న సమయంలో.. బైక్‌పై నుంచి కింద పడి మృతి చెందింది. మృతురాలిని పంచాయతీ కార్యదర్శిగా గుర్తించారు. ఈ ఘటన ధారూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం..

Telangana: గ్రూప్ 1 పరీక్ష రాసి ఇంటికి వెళ్తుండగా విషాదం.. మహిళా అభ్యర్ధి మృతి
Panchayat Secretary Died In A Road Accident
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 10, 2024 | 10:09 AM

బొంరాస్‌పేట, జూన్‌ 10:

ఆదివారం జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసి ఇంటికి తిరిగి వెళ్లుండగా ఓ అభ్యర్ధి మార్గం మధ్యలో కన్నుమూసింది. పరీక్ష కేంద్రం నుంచి బైక్‌పై వెళ్తున్న సమయంలో.. బైక్‌పై నుంచి కింద పడి మృతి చెందింది. మృతురాలిని పంచాయతీ కార్యదర్శిగా గుర్తించారు. ఈ ఘటన ధారూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ధారూరు పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..

బొంరాస్‌పేట మండలంలోని దేవులనాయక్‌తండాకు చెందిన సుమిత్రాబాయి (32) అనే మహిళ యాలాల మండలంలోని అచ్యుతాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె ఆదివారం జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసేందుకు భర్త నెహ్రూనాయక్‌తో కలిసి బైక్‌పై వికారాబాద్‌కు వెళ్లింది. ఎగ్జామ్‌ రాసిన తర్వాత అక్కడి నుంచి తాండూరుకు తిరిగి వెళ్తున్న క్రమంలో గట్టేపల్లితండా సమీపంలో వర్షం కురుస్తుండటంతో సుమిత్రబాయి గొడుగు తెరిచి పట్టుకుంది. బలమైన ఈదురు గాలులు వీచడంతో గొడుగు లేచిపోయింది. దీంతో బైక్‌ అదుపుతప్పడంతో బైక్‌ పై నుంచి సుమిత్రా బాయి కిందపడిపోయింది. ఈ ఘటనలో సుమిత్రా బాయి తలకు బలమైన గాయం అయ్యింది. దీంతో ఆమెను తాండూరు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతురాలి భర్త నెహ్రూనాయక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని కూడా తాండూరు దవాఖానకు తరలించగా అక్కడ వైద్యులు చికిత్స అందించారు. నెహ్రూనాయక్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నెహ్రూనాయక్‌ బీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడిగా, మండల సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జిగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రమాదవార్త తెలియగానే కొడంగల్‌ తాలూకా సేవాలాల్‌ సంఘం అధ్యక్షుడు దేశ్యానాయక్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు తాండూరు దవాఖానకు చేరుకుని మృతురాలి భర్తను పరామర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.