Metro rail: మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై టికెట్‌ పొందడం మరింత సులువు..

ఇప్పటికే మొబైల్‌ యాప్‌, వాట్సాప్‌తో పాటు పలు బుకింగ్స్‌ యాప్స్ ద్వారా మెట్రో టికెట్లను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రముఖ బైక్‌ షేరింగ్ యాప్‌ ర్యాపిడో ద్వారా కూడా మెట్రో రైల్‌ను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. త్వరలోనే ర్యాపిడో ద్వారా మెట్రో రైల్‌ టికెట్‌ను బుక్‌ చేసుకునే అవకాశం లభించింది...

Metro rail: మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై టికెట్‌ పొందడం మరింత సులువు..
Hyderabad Metro
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 21, 2024 | 7:13 PM

హైదరాబాదీల ట్రాఫిక్‌ కష్టాలను తీరుస్తూ అందుబాటులోకి వచ్చింది మెట్రో. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం లభించడంతో హైదరాబాదీలు మెట్రోవైపు మొగ్గు చూపుతూ వచ్చారు. ఇక కాలక్రమేణా మెట్రో టికెట్‌ బుకింగ్స్‌లో ఎన్నో మార్పులు చేర్పులు జరగుతూ వస్తున్నాయి. ప్రయాణికులకు టికెట్ బుకింగ్‌ను మరింత సులభతరం చేసే నేపథ్యంలో సేవలను తీసుకొస్తున్నారు.

ఇప్పటికే మొబైల్‌ యాప్‌, వాట్సాప్‌తో పాటు పలు బుకింగ్స్‌ యాప్స్ ద్వారా మెట్రో టికెట్లను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రముఖ బైక్‌ షేరింగ్ యాప్‌ ర్యాపిడో ద్వారా కూడా మెట్రో రైల్‌ను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. త్వరలోనే ర్యాపిడో ద్వారా మెట్రో రైల్‌ టికెట్‌ను బుక్‌ చేసుకునే అవకాశం లభించింది. ఈ మేరకు మెట్రో యాజమాన్యం ఇప్పటికే ర్యాపిడోతో ఒప్పందం చేసుకుంది.

ఈ సేవలతో ప్రయాణికులకు మెట్రో స్టేషన్‌కు వెళ్లకుండానే ఎక్కడి నుంచి ఎక్కడికైనా క్షణాల్లో మెట్రో టికెట్‌ను బుక్‌ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఎల్‌ & టీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీబీ రెడ్డి ఈ సేవలను ప్రారంభించారు. ఈ విషయమై కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో ప్రజా రవాణాను మరింత మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ.. ర్యాపిడోతో కొత్త భాగస్వామ్యం ఫస్ట్‌, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని పెంపొందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎల్‌ & టీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ సుధీర్‌ చిప్లుంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ర్యాపిడో ద్వారా 15శాతం మెట్రో టికెట్లు బుక్‌ అవుతాయని అంచనా వేస్తున్నారు. ర్యాపిడో యాప్‌లోకి వెళ్లిన తర్వాత మెట్రో ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. అనంతరం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో ఎంచుకొని పేమెంట్ చేస్తే ఈ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టికెట్‌ను స్కాన్‌ చేస్తే మెట్రోలోకి ఎంటర్‌ అవ్వొచ్చు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..