సూది లేకుండానే రక్త పరీక్షలు.. ఏఐతో టెస్టులు.. వెంటనే రిపోర్టులు.. ఎక్కడో కాదు మన దగ్గరే..
భారతదేశంలో మొట్టమొదటి సరిగా సూది అవసరం లేకుండానే రక్త పరీక్ష చేసి ఒక్క నిమిషంలోనే రిపోర్ట్ ఇచ్చే ఏఐ బేస్డ్ డయాగ్నొస్టిగ్ టూల్ ను నిలోఫర్‌లో అందుబాటులోకి తెచ్చారు. నిలోఫర్ హాస్పిటల్, సుశేనా హెల్త్ ఫౌండేషన్ తో కలిసి క్విక్ వైటల్స్ దీన్ని అందుబాటులోకి తెచ్చింది.

వైద్య శాస్త్రం రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. కంప్యూటర్‌ల నుండి మొబైల్ ఫోన్‌ల నుండి CT, MRI మెషీన్‌ల వరకు సాంకేతికత అభివృద్ధి, ఆధునిక అల్ట్రాసౌండ్, ల్యాబ్ పరీక్షలు చేయడంలో అద్భుతమైన కొత్త మార్గాలు శాస్త్రీయ ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్నాయి.. ఈ క్రమంలోనే.. భారతదేశంలో మొట్టమొదటి సరిగా సూది అవసరం లేకుండానే రక్త పరీక్ష చేసి ఒక్క నిమిషంలోనే రిపోర్ట్ ఇచ్చే ఏఐ బేస్డ్ డయాగ్నొస్టిగ్ టూల్ ను నిలోఫర్‌లో అందుబాటులోకి తెచ్చారు. నిలోఫర్ హాస్పిటల్, సుశేనా హెల్త్ ఫౌండేషన్ తో కలిసి క్విక్ వైటల్స్ దీన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఫోటోప్లెథిస్మోగ్రఫీ ద్వారా మొబైల్ లో ఫేస్ స్కానింగ్ ద్వారా 20 నుండి 30 సెకన్లలోనే టెస్టులు పూర్తవుతాయి. ఈ పరీక్ష విధానాన్ని మొదట నిలోఫర్ లోకి అందుబాటులోకి తెచ్చి నెక్స్ట్ మహారాష్ట్ర లో ప్రవేశపెడుతున్నాని సంస్థ నిర్వాహకులు తెలిపారు. నిలోఫర్ ఆసుపత్రిలో పిల్లలకు, గర్భిణులకు ఇలాంటి టెస్టుల ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిలోఫర్ వైద్యులు తెలిపారు.
ఇది పిల్లలు, గర్భిణీ స్త్రీలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. భారతదేశంలో ఈ పరివర్తనాత్మక కార్యక్రమంను అందుబాటులోకి వచ్చింది. అమ్మత్ స్వస్త్ భారత్‌తో ఆరోగ్య పర్యవేక్షణ ఇక సెల్ఫీ తీసుకున్నంత సులభం. మొబైల్ ఫేస్ స్కానింగ్ టెక్నాలజీ కీలకమైన ఆరోగ్య సమాచారాన్ని వేగవంతమైన రీతిలో అందిస్తుంది. దీనితో రక్తపోటు, హార్ట్ రేట్, హీమోగ్లోబిన్ ఏ1సి వంటివి తెలుసుకోవచ్చు. ఈ పరీక్షలు 20 -60 సెకన్ల లోనే పూర్తవుతాయి. త్వరలోనే ఈ సేవలను దేశంలో కూడా అందుబాటులోకి తీసుకురానున్నామని నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..