హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోని అన్ని కోర్టుల్లో మార్చి 9న లోక్ అదాలత్‌లు నిర్వహించనున్నట్టు జాతీయ లోక్అదాలత్ తెలిపింది. ఆయా కేసులను రాజీమార్గాన పరిష్కరిస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాతీయ లోక్ అదాలత్ సూచించింది. బ్యాంకు రికవరీలు, మోటరు ప్రమాద నష్టపరిహార కేసులు, సివిల్ తగాదాలు, భూతగాదాలు, ఆస్తి, కుటుంబ తగాదాలు, ప్రీ లిటిగేషన్ కేసులు, భూసేకరణ కేసులను ఈ లోక్ అదాలత్ ల్లో పరిష్కారం పొందవచ్చని జాతీయ లోక్ అదాలత్ పేర్కొంది.