Hyderabad: బోనాల్లో పోతరాజు బుస్ బుస్.. కట్ చేస్తే, పోలీస్ స్టేషన్‌లో కిస్ కిస్.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..

Nagini dance with python: పాము అంటేనే భయపడి ఆమడదూరం పారిపోతారు. ప్రమాదకరమైన కొండచిలువను మెడలో వేసుకుని నాగిని డ్యాన్స్ చేస్తే.. సీన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి.. బోనాల వేడుకల్లో పోతరాజు వేషం వేసిన ఓ వ్యక్తి..

Hyderabad: బోనాల్లో పోతరాజు బుస్ బుస్.. కట్ చేస్తే, పోలీస్ స్టేషన్‌లో కిస్ కిస్.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..
Hyderabad News
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 19, 2023 | 9:59 AM

Nagini dance with python: పాము అంటేనే భయపడి ఆమడదూరం పారిపోతారు. ప్రమాదకరమైన కొండచిలువను మెడలో వేసుకుని నాగిని డ్యాన్స్ చేస్తే.. సీన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి.. బోనాల వేడుకల్లో పోతరాజు వేషం వేసిన ఓ వ్యక్తి కొండ చిలువను మెడలో వేసుకుని డ్యాన్స్ చేసి.. చివరకు కటకటాలపాలయ్యాడు. హైదరాబాద్ పాతబస్తీ శాలిబండలో జరిగిన బోనాల వేడుకల్లో ఈ సంఘటన జరిగింది. బోనాల పండుగలో భాగంగా కళాకారులు డప్పు వాయిద్యాలతో ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇంతలో ఉన్నట్టుండి ..ఓ కళాకారుడు పేద్ద కొండ చిలువ పామును బుట్టలోంచి బయటకు తీశాడు. ఏకంగా కొండచిలువను తన మెడలో వేసుకున్న ఆ కళాకారుడు పామును అటు ఇటు తిప్పుతూ నాగిని నృత్యం చేశాడు.

ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటనతో అక్కడున్న వారు దెబ్బకు షాకయ్యారు. గుండెల్లో దడపుట్టి ఒక్కసారిగా ఆమడదూరం జరిగారు. మరికొందరు యువకులు మాత్రం చుట్టూ చేరి తెగ ఎంజాయ్ చేశారు. సోషల్ మీడియోలో ఈ వీడియో తెగ వైరల్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కొండ చిలువను మెడలో వేసుకుని డ్యాన్స్ చేస్తున్న కళాకారుడిని అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కినెట్టారు.

పాముతో నృత్యం చేయడం.. పామును హింసించడం నేరం.. కావున జంతు హింస నేరం కావడంతో.. యానిమల్ యాక్ట్ కింద కేసు బుక్ చేశారు. పాముతో బహిరంగంగా నృత్యాలు చేయడం ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదకరమని పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి సంఘటన ఇదే మొదటిసారి అని స్థానికులు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..