Hyderabad Muharram 2023: మొహర్రం ఊరేగింపునకు సర్వం సిద్ధం.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

|

Jul 29, 2023 | 8:10 AM

Muharram Procession in Hyderabad: హైదరాబాద్ లో మొహర్రం ఊరేగింపునకు సర్వంసిద్ధమైంది. మొహర్రం ఊరేగింపులో భాగంగా ఇవాళ పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలుంటాయని హైదరాబాద్ పోలీసు అధికారులు తెలిపారు. కాగా.. మొహరం ఊరేగింపులో భాగంగా మహారాష్ట్ర నుంచి మాధురి ఏనుగును

Hyderabad Muharram 2023: మొహర్రం ఊరేగింపునకు సర్వం సిద్ధం.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
Hyderabad Muharram 2023
Follow us on

Muharram Procession in Hyderabad: హైదరాబాద్ నగరంలో మొహర్రం ఊరేగింపునకు సర్వంసిద్ధమైంది. మొహర్రం ఊరేగింపులో భాగంగా ఇవాళ పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలుంటాయని హైదరాబాద్ పోలీసు అధికారులు తెలిపారు. కాగా.. మొహరం ఊరేగింపులో భాగంగా మహారాష్ట్ర నుంచి మాధురి ఏనుగును ప్రత్యేకంగా నిజాం ట్రస్ట్ నిర్వాహకులు ప్రభుత్వ సహకారంతో నగరానికి తీసుకొచ్చారు. పాతబస్తీ డబీర్పుర బీబీకా అలవ నుండి బీబీకాఅలం వరకు ఊరేగింపు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఉరేగింపుకు సంబంధించి అన్ని భద్రత ఏర్పాట్లుపూర్తయ్యాయి.. దాదాపు 7 కిలోమీటర్ల మేర ఊరేగింపు ఉంటుంది. అందుకు దాదాపు 2000మంది పోలీసులు బందోబస్తులో ఉండనున్నారు. స్థానిక పోలీసులే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్, క్రైమ్ టీమ్స్, షి టీమ్స్, ట్రాఫిక్ పోలీసులు, గతంలో ఇక్కడ పనిచేసి వెళ్లిన పోలీస్ అధికారులు సైతం ఉంటారని దక్షిణ మండలం డిసిపి తెలిపారు. నగరంలోని బజార్ ఘాట్ లోని ఆశుర్ ఖన హజరత్ అబ్బాస్ లో కూడా రాత్రి మొహరం సంతాప దినాలు పురస్కరించుకొని స్థానికులు అగ్నిగుండం తొక్కారు. ఉన్నతస్థాయి అధికారులు తోపాటు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా అలంను దర్శించుకున్నారు.

Hyderabad Traffic

మధ్యాహ్నం డబీర్ పుర బీబీ క అలవ నుండి మాధురి ఏనుగు పై బిబి క అలం ఊరేగింపు మొదలవుతాయి. షేక్ ఫైజ్ కామన్, ఇత్తెబర్ చౌక్, అలిజా కోట్ల, చార్మినార్, పంజేష, మీర్ అలం మండి, పురాని హావేలి, దారుల్ శిఫ, కాలి ఖబర్, చదర్గాట్ మస్జీద్ ఏ ఇలాహి వరకు కొనసాగుతుంది. ఈ ఊరేగింపులో షియా ముస్లింలు తమ శరీరాన్ని బ్లేడ్లు, కత్తులతో కోసుకుంటూ రక్తాన్ని చిందిస్తు తమ సంతాపాన్ని తెలియపరుస్తారు.

7 కిలోమీటర్లు సాగనున్న ఊరేగింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉన్నతాధికారులు సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..