AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో దేవుడా.. గంటల వ్యవధిలోనే తల్లి, శిశువు మృతి.. ఆసుపత్రిలో అసలేం జరిగింది..

శుక్రవారం రాత్రి అరుణకు మరోసారి నొప్పులు రావడంతో, ఆశా వర్కర్లకు ఫోన్‌ చేయగా వారు అంబులెన్స్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కాగా శనివారం ఉదయం 7.50కు అరుణ మగ బిడ్డకు జన్మనిచ్చింది. నార్మల్ డెలవరీ అయింది.. అయితే.. శిశువు ఉమ్మనీరు తాగాడని నిలోఫర్‌కు తీసుకెళ్లాలని చెప్పడంతో అక్కడికి తీసుకెళ్లారు అరుణ కుటుంబ సభ్యులు..

అయ్యో దేవుడా.. గంటల వ్యవధిలోనే తల్లి, శిశువు మృతి.. ఆసుపత్రిలో అసలేం జరిగింది..
Crime News
P Shivteja
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jun 01, 2025 | 10:41 AM

Share

సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. ప్రసవమైన కొద్ది నిమిషాల్లోనే తల్లి మరణించగా గంటల వ్యవధిలోనే.. పుట్టిన బిడ్డ కూడా ప్రాణాలు విడిచాడు.. హైదరాబాద్ బాలానగర్‌ ఠాణా పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలను సీఐ టి.నర్సింహరాజు వెల్లడించారు. బాలానగర్ లో ప్రసవమైన కొద్ది నిమిషాల్లోనే తల్లి మరణించగా గంటల వ్యవధిలోనే.. పుట్టిన బిడ్డ కూడా ప్రాణాలు విడిచాడు.. కేపీహెచ్‌బీకాలనీ నాలుగోఫేజ్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ రాములు, లక్ష్మి దంపతుల కుమార్తె పి.అరుణ(23)కు సంగారెడ్డి జిల్లా మానూరు మండలం రానాపూర్ తండాకు చెందిన శ్యామ్యుల్ అనే వ్యక్తితో ఏడాది క్రితం వివాహం జరిగింది. వీరు ఇరువురు గత కొద్దిరోజులుగా జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నారు. అరుణ గర్భవతి కావడంతో మూడు మాసాలుగా తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. శుక్రవారం కడుపు నొప్పి వస్తోందని చెప్పడంతో బాలానగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు అరుణ తల్లిదండ్రులు.. అయితే ప్రసవానికి సమయం పడుతుందని గాంధీ లేదా నిలోఫర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.

శుక్రవారం రాత్రి అరుణకు మరోసారి నొప్పులు రావడంతో, ఆశా వర్కర్లకు ఫోన్‌ చేయగా వారు అంబులెన్స్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కాగా శనివారం ఉదయం 7.50కు అరుణ మగ బిడ్డకు జన్మనిచ్చింది. నార్మల్ డెలవరీ అయింది.. అయితే.. శిశువు ఉమ్మనీరు తాగాడని నిలోఫర్‌కు తీసుకెళ్లాలని చెప్పడంతో అక్కడికి తీసుకెళ్లారు అరుణ కుటుంబ సభ్యులు.. ఆ తర్వాత అరుణ తమ్ముడు అరవింద్‌ ఆరోగ్య కేంద్రానికి వచ్చేసరికి ఆమె విగతజీవిగా పడి ఉంది.

అరుణ మృతి చెందిన విషయాన్ని నర్సులు గోప్యంగా ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అరుణ కుటుంబ సభ్యులు.. తమకు ఈ విషయాన్ని బాలానగర్‌ PHC వైద్యులు చెప్పలేదని అంటున్నారు. ఈ క్రమంలోనే.. పుట్టిన కొన్ని గంటలకే బిడ్డ కూడా ప్రాణాలు కోల్పోయాడు. నర్సుల నిర్లక్ష్యం కారణంగానే అరుణ మృతి చెందిందని బాధితురాలి తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బుల్లేక PHCకి వెళ్లి చెల్లెలిని, బిడ్డను పోగొట్టుకున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అరుణ సోదరుడు అరవింద్‌.

తమ నిర్లక్ష్యమేమీ లేదని.. తమ పరిధిలో ఉన్న వైద్యం అందించామని ఆరోగ్య కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌ డా.విజయనిర్మల చెప్పారు.. తల్లీబిడ్డ మరణాలపై విచారణకు ఆదేశించామని.. ప్రాథమిక నివేదికను అధికారులకు సమర్పించాం DMHO తెలిపారు. ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజంతో బాలింత మృతి చెందినట్టు నిర్ధారణ అయిందన్నారు. డెలివరీ తర్వాత బాలింత అరుణ బాగానే ఉన్నారు, టిఫిన్‌ చేశారని.. 23 ఏళ్ల బాలింత మృతి దురదృష్టకరం అని DMHO పేర్కొన్నారు.

ఈ ఘటన అనంతరం రెండు మృతదేహాలను వారి సొంత గ్రామం అయిన మానూరు మండలం రానాపూర్ తండాకు తరలించారు..అక్కడే అత్యక్రియలు జరగనున్నాయి.. ఏది ఏమైనా గంటల వ్యవధిలోనే అటు తల్లి, ఇటు బిడ్డ గంటల వ్యవధిలో మృతి చెందడంతో రెండు కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..