AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Miss World Contestants: చార్మినార్ అందాలకు సుందరాంగులు ఫిదా.. సెల్ఫీలు దిగి మురిసిపోయిన ముద్దుగుమ్మలు!

హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న 72వ మిస్‌వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన 109 దేశాల అందగత్తెలు ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ వద్ద సందడి చేశారు.ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ సందర్శన 109 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్‌కు అద్భుతమైన మధురానుభూతులను అందించింది. ఐదు శతాబ్దాలుగా హైదరాబాద్ మధ్యన ఠీవిగా నిలబడి ఉన్న ఈ సొగసైన కట్టడాన్ని చూసిన సుందరాంగులు మంత్రముగ్ధులయ్యారు.

Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: May 13, 2025 | 8:42 PM

Share
హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న 72వ మిస్‌వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన 109 దేశాల అందగత్తెలు ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ వద్ద సందడి చేశారు. చార్మినార్‌ వద్దకు వచ్చిన వారికి  అధికారులు రెడ్ కార్పెట్ స్వాగతం పలకగా.. స్థానికులు మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలికారు. అరబ్బీ మర్ఫా వాయిద్యాలకు అనుగుణంగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు స్టెప్పులేశారు.

1 / 5
ఈ అందాల రాయబారులతో చార్మినార్ పరిసరాలు ఒక సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ప్రత్యేకంగా చార్మినార్ వద్ద ఫోటోషూట్ కు హాజరైన సుందరాంగులు, ఈ చారిత్రాత్మిక వేదిక నుండి ప్రజలకు అభివాదం చేస్తూ, తమ ఆనందం, సంతోషాన్ని వ్యక్తం చేశారు. చార్మినార్ అందాలను తమ మొబైల్స్‌ ఫోటోలను తీసుకున్నారు.

2 / 5

సందర్శనలో భాగంగా, చార్మినార్ సమీపంలోని ప్రసిద్ధ చుడీ బజార్ (లాడ్ బజార్)లో కంటెస్టెంట్స్ గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువుల కొనుగోలు చేసి, స్థానిక హస్తకళల పట్ల ఆసక్తిని ప్రదర్శించారు. కొందరు కంటెస్టెంట్స్ గాజుల తయారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించి, నిపుణులైన కారిగర్లు (కళాకారులు), శిల్పులకు ప్రశంసలు తెలిపారు.

3 / 5
ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ సందర్శన 109 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్‌కు అద్భుతమైన మధురానుభూతులను అందించింది. ఐదు శతాబ్దాలుగా హైదరాబాద్ మధ్యన ఠీవిగా నిలబడి ఉన్న ఈ సొగసైన కట్టడాన్ని చూసిన సుందరాంగులు మంత్రముగ్ధులయ్యారు.

4 / 5
ఈ కార్యక్రమం ద్వారా, తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, సౌందర్యం ప్రపంచానికి తెలియజేసినట్లయ్యింది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందర్శన కేవలం పోటీలలో భాగంగానే కాకుండా, ప్రపంచ శాంతి సాంస్కృతిక సామరస్యానికి సాక్ష్యంగా నిలిచింది.

5 / 5