Miss World 2025: అట్టహాసంగా ప్రారంభమైన మిస్‌ వరల్డ్‌ పోటీలు.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన క్రిష్టినా పిస్కోవా

72వ మిస్‌ వరల్డ్ పోటీలు శనివారం (మే 10) సాయంత్రం 6 గంటలకు అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ పాటతో ప్రపంచ సుందరి పోటీలు ప్రారంభమైనాయి. గచ్చిబౌలి వేదికగా కన్నుల పండుగ ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. 110 దేశాల కంటెస్టెంట్లు..

Miss World 2025: అట్టహాసంగా ప్రారంభమైన మిస్‌ వరల్డ్‌ పోటీలు.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన క్రిష్టినా పిస్కోవా
Miss World Pageant At Hyderabad

Updated on: May 10, 2025 | 8:06 PM

హైద‌రాబాద్, మే 10: హైదరాబాద్‌ వేదికగా 72వ మిస్‌ వరల్డ్ పోటీలు శనివారం (మే 10) సాయంత్రం 6 గంటలకు అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ పాటతో ప్రపంచ సుందరి పోటీలు ప్రారంభమైనాయి. గచ్చిబౌలి వేదికగా కన్నుల పండుగ ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. 110 దేశాల కంటెస్టెంట్ల పరిచయ కార్యక్రమం ఈ రోజు జరిగింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇక మిస్ వరల్డ్ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా మిస్ వరల్డ్ 2024 క్రిష్టినా పిస్కోవా నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎస్ రామకృష్ణారావు, బీజేపీ జితేందర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఇతరులు హాజరైనారు.

కాగా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ మిస్ వరల్డ్ పోటీలకు సీఎం రేవంత్ రెడ్డి దూరం ఉన్నారు. ఆయన ఈ రోజు మిస్ వరల్డ్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరుకావల్సి ఉండగా చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మిస్ వరల్డ్ పోటీలు మే 10 నుంచి మే 31 వరకు దాదాపు 22 రోజుల పాటు జరగనున్నాయి. హైదరాబాద్ మహానగరం తొలిసారి మిస్‌ వరల్డ్ పోటీలకు అతిథ్యమిస్తోంది. దాదాపు 120 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొనవల్సి ఉండగా.. ఇప్పటి వరకు 111 మంది అందగత్తెలు మాత్రమే మహా నగరానికి చేరుకున్నారు. కాగా వరుసగా రెండోసారి ఈ పోటీలు భారత్‌లోనే జరుగుతుండటం విశేషం. గతేడాది మిస్‌ వరల్డ్‌ 71వ ఎడిషన్‌ పోటీలు ముంబైలో జరిగాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.