Telangana: గవర్నర్ తన పని తాను చేసుకోవాలి.. తెలంగాణ చరిత్ర ఆమెకు తెలియదు.. మంత్రి సత్యవతి రాథోడ్ షాకింగ్ కామెంట్స్

|

Sep 08, 2022 | 3:15 PM

తెలంగాణ (Telangana) గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. గవర్నర్ బీజేపీ నాయకురాలిగా మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తన పని తాను చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి...

Telangana: గవర్నర్ తన పని తాను చేసుకోవాలి.. తెలంగాణ చరిత్ర ఆమెకు తెలియదు.. మంత్రి సత్యవతి రాథోడ్ షాకింగ్ కామెంట్స్
Satyavathi Rathod
Follow us on

తెలంగాణ (Telangana) గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. గవర్నర్ బీజేపీ నాయకురాలిగా మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తన పని తాను చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ ఎప్పుడు రావాలన్నది ఆయన ఇష్టమని, గవర్నర్ తన పరిధి దాటి బీజేపీ ప్రతినిధిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వరదలు వస్తే ప్రభుత్వం ఉండగా మీకేం పని అని పరామర్శలు, పర్యటనలకు వెళ్లారని ప్రశ్నించారు. తెలంగాణ చరిత్ర గవర్నర్ కు తెలియదని, అందుకే విమోచనం అంటున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు మహిళల పట్ల చాలా గౌరవం ఉందని మంత్రి సత్యవతి చెప్పారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.

కాగా.. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాను వెనక్కి తగ్గేదేలేదని, తన పని తాను చేసుకుంటూ పోతానని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని, వరంగల్ పర్యటనలో తనను అవమానించారని చెప్పారు. తనకు వ్యక్తిగతంగా గౌరవం అవసరం లేదని, రాజ్ భవన్ ను గౌరవించాలన్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని, ప్రోటోకాల్ ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కుతుందని మండిపడ్డారు.

వరదల సమయంలో రెడ్ క్రాస్ ద్వారా సహాయ కార్యక్రమాలు చేపట్టాం. మేడారం జాతరకు హెలికాప్టర్ అడిగితే ఇవ్వలేదు. చివరికి 8 గంటలు కారులో ప్రయాణించి రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. గవర్నర్ ఆఫీస్ పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన వివక్ష చూపిస్తోంది. రాజ్ భవన్ ఏమైనా అంటరాని స్థలమా.. ఎందుకు మీరంతా రాజ్ భవన్ లోకి అడుగుపెట్టడం లేదు. కౌశిక్ రెడ్డి రాజకీయ నాయకుడని తాను రిజక్ట్ చేయలేదని, సర్వీస్ కోటా కింద కౌశిక్ రెడ్డి ఫిట్ కారనే ఉద్దేశంతోనే రిజక్ట్ చేశాను.

ఇవి కూడా చదవండి

    – తమిళిసై సౌందర రాజన్, తెలంగాణ గవర్నర్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..