KTR: అభివృద్ధికి అడ్డాగా హైదరాబాద్.. ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించిన కేటీఆర్‌

|

Jun 14, 2022 | 5:48 PM

హైటెక్ సిటీలో జాన్సన్‌ కంట్రోల్‌ (Johnson Controls) కు చెందిన ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషనల్‌ సెంటర్ టీ-హబ్‌, టీ-సెల్‌ హైదరాబాద్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.

KTR: అభివృద్ధికి అడ్డాగా హైదరాబాద్.. ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించిన కేటీఆర్‌
Minister Ktr
Follow us on

Minister KTR: హైదరాబాద్‌కు వస్తున్న పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ (KTR) పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్ సింగిల్‌ స్టాప్‌ డెస్టినేషన్‌గా మారిపోయిందంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం తయారీ రంగానికి, అభివృద్ధికి హైదరాబాద్ (Hyderabad) అడ్డాగా మారబోతుందని.. హైదరాబాద్‌కు మరిన్ని కంపెనీలు రానున్నట్లు కేటీఆర్ వివరించారు. మంగళవారం హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీలో జాన్సన్‌ కంట్రోల్‌ (Johnson Controls) కు చెందిన ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషనల్‌ సెంటర్ టీ-హబ్‌, టీ-సెల్‌ హైదరాబాద్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఇమేజ్‌ టవర్స్‌ సైతం నగరంలో నిర్మిస్తున్నామని, నగరంలో ప్రపంచ స్థాయి కమాండ్ కంట్రోల్‌ రూమ్‌ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేటీఆర్ వివరించారు.

భారత్‌లో కార్యకలాపాలు విస్తరించిన జాన్సన్‌ కంట్రోల్‌ కార్యకలాపాలు హైదరాబాద్‌లో కూడా కొనసాగనున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌లో ఇంట్రూజన్‌, యాక్సెస్‌ కంట్రోల్‌, వీడియో సర్వైలెన్స్‌కు సంబంధించిన ఉత్పత్తులను జాన్సన్ కంట్రోల్ తయారు చేయనుందని తెలిపారు. ఈ సెంటర్‌లో 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని.. కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..