
Asaduddin on Uniform Civil Code: దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) పై మరోసారి చర్చ జరుగుతోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో యూసీసీ బిల్లు ప్రవేశపెట్టడానికి బీజేపీ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో.. యూనిఫాం సివిల్ కోడ్ పై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. ఎన్నికల సమయంలో ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని తెరపైకి తెచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారంటూ విమర్శించారు. లోక్ సభ ఎలక్షన్స్ కు ముందు UCCని పొలిటికల్ ఎక్సర్సైజ్ లాగా బీజేపీ యూజ్ చేస్తుందని.. దీంతో లబ్ధి పొందాలని చూస్తోందని ఓవైసీ ఆరోపించారు. భారత దేశంలో UCC అవసరమే లేదని.. 21లా కమిషన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ ఈ దేశాన్ని ఏమి చేయాలనుకుంటుదంటూ ప్రశ్నించారు. బీజేపీ ఒక కన్నుతో మాత్రమే చూస్తుందని చురకలంటిచారు.
దీంతోపాటు అసదుద్దీన్ ఒవైసీ కేరళ గవర్నర్ పై కూడా విమర్శలు గుప్పించారు. గవర్నర్ కేంద్రానికి సపోర్ట్ చేస్తా అంటే బీజేపీ కండువా కప్పుకోవాలని సూచించారు. ఇటీవల సీఎం కేసీఆర్ ని కలిసి ఉమ్మడి పౌరస్మృతిపై చర్చించామన్నారు. UCC ని వ్యతిరేకిస్తామని కేసీఆర్ అన్నారని తెలిపారు. త్వరలో ఏపీ సీఎం జగన్ ని కలుస్తానని.. ఇప్పటికే YCP ఎంపి మిథున్ రెడ్డికి ఫోన్ చేసి UCC పై చర్చించినట్లు తెలిపారు.
ఇక ఉమ్మడి పౌరస్మృతి విషయంలో ఆప్ వ్యవహార శైలి భిన్నంగా ఉందని అసదుద్దీన్ మండిపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ UCCకి సపోర్ట్ చేస్తే.. అదే ఆప్ పంజాబ్ ముఖ్యమంత్రి UCCకి వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. UCC విషయంలో కాంగ్రెస్ స్టాండ్ ఏమి లేదని.. ఈ వ్యవహారంలో హస్తం పార్టీ మౌనంగా ఉందని అసదుద్దీన్ పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..