
ఎక్కడ చూసినా కల్తీ.. ఏది తిన్నా విషం అన్నట్లుగా మారిపోయింది ప్రస్తుతం మన పరిస్థితి. నిత్య జీవితంలో ఉపయోగించే ప్రతి వస్తువు కలుషితం అయిపోతుంటే.. డబ్బులు వెచ్చించి మరీ కొనుగోలు చేసి మోసపోవడం సామాన్య జనాల వంతుగా మారింది. కల్తీ అని ఏ మాత్రం అనుమానం రాకుండా ఒరిజినల్ బ్రాండెడ్ వస్తువులుగా ప్యాకింగ్ చేయడం.. అది నిజం అని ప్రజలు డబ్బులు పెట్టి మరీ కొనుగోలు చేసి వాడడం, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవడం ఇప్పుడు అంతటా జరుగుతోంది. ఇదే క్రమంలో తాజాగా కాటేదాన్‌లో భారీగా కల్తీ నిత్యావసర సరుకుల గుట్టు బయటికి వచ్చింది.
హైదరాబాద్ నగరం కాటేదాన్‌లో భారీగా కల్తీ వస్తువులు పట్టుబడ్డాయి. 20 రకాల కిరాణా వస్తువులు సీజ్ చేసిన రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందం సీజ్ చేసింది. ఈ చర్యకు పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ వస్తువులనే ఒరిజినల్ అన్నట్లుగా ప్యాకింగ్ చేసి మార్కెట్లలో విక్రయిస్తున్నారు ఇందుకు సంబంధించిన ఓ ముఠా. ప్రజలకు, దుకాణదారులకు ఏ మాత్రం అనుమానం రాకుండా ఒరిజినల్ ప్రొడక్ట్స్ లాగా ప్యాకింగ్ చేసి బయటికి వదులుతున్నారు కంత్రీగాళ్లు. తద్వారా లక్షల్లో సంపాదిస్తూ పబ్బం గడుపుతున్నారు. ఈ విషయమై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందం.. కల్తీ వస్తుల తయారీ కేంద్రంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించింది. ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించి మనం నిత్య జీవితంలో సాధారణంగా ఉపయోగించే వివిధ రకాలైన కిరాణా వస్తువులను తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎస్ఓటీ బృందం సీజ్ చేసిన కల్తీ వస్తువుల వివరాలు:
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..