హైదరాబాద్‌లో దారుణం, బీరుసీసా కడుపులో పొడిచి, హత్యాయత్నం..!
హైదరాబాద్ నగర శివారు ప్రాంతం మైలార్‌దేవ్‌పల్లిలో తాగుబోతులు వీరంగం సృష్టించారు. స్థానికంగా ఉన్న శ్రీ కృష్ణ వైన్స్‌లో మద్యం సేవిస్తూ గొడవకు దిగారు. వైన్స్‌లో పనిచేసే మహేందర్ అనే వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి చేసి చితకబాదారు. బీరుబాటిల్ పగులగొట్టి కడుపులో పొడిచి హత్యాయత్నంకు ప్రత్నించారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. పోలీసులు వచ్చేసరికే దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు ఆటోలో పరారయ్యారు. తాగుబోతులు గొడవ పడిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డయ్యాయి. సీసీ […]
హైదరాబాద్ నగర శివారు ప్రాంతం మైలార్‌దేవ్‌పల్లిలో తాగుబోతులు వీరంగం సృష్టించారు. స్థానికంగా ఉన్న శ్రీ కృష్ణ వైన్స్‌లో మద్యం సేవిస్తూ గొడవకు దిగారు. వైన్స్‌లో పనిచేసే మహేందర్ అనే వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి చేసి చితకబాదారు. బీరుబాటిల్ పగులగొట్టి కడుపులో పొడిచి హత్యాయత్నంకు ప్రత్నించారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. పోలీసులు వచ్చేసరికే దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు ఆటోలో పరారయ్యారు. తాగుబోతులు గొడవ పడిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజి ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.