
తెలంగాణలో హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ గురువారం ఉదయం ప్రారంభం కానుంది. మూడు ఉమ్మడి జిల్లాల నుంచి మెుత్తం 21 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ నుంచి ఏవిఎన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ నుంచి గుర్రం చెన్నకేశవ రెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ నుంచి కాటేపల్లి జనార్థన్‌రెడ్డి, యూటీఎఫ్ నుంచి మాణిక్‌రెడ్డి, ఎస్టీయూటీఎస్ నుంచి భుజంగరావు, బీసీటీఏ నుంచి విజయకుమార్ పోటీలో ఉన్నారు. ప్రధానంగా చెన్నకేశవ రెడ్డి, కాటెపల్లి జనార్దన్ రెడ్డి, AVN రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, మణిక్ రెడ్డి మధ్య పోటీ నెలకొంటుందని పేర్కొంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ మేరకు ఇప్పటికే పోలీసు సిబ్బందిని మోహరించారు. కౌంటింగ్ కోసం.. 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 29వేల,720 ఓట్ల కు గాను.. 26 వేల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్కో టేబుల్ పై 1000 ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 21 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోటీ మాత్రం పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి, పీఆర్టీయూటీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి మధ్య ఉండనుందని టీచర్లు పేర్కొంటున్నారు. చెన్నకేశవరెడ్డికి సర్కారు పెద్దలు మద్దతిచ్చినట్టు తెలుస్తోంది. మరోపక్క బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి తరఫున కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్ రావు తదితరులు ప్రచారం చేశారు.
ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లలో 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై 1000 ఓట్ల చొప్పున లెక్కింపు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన 26 టేబుళ్లపై లెక్కింపు జరగనుంది. ఏడు టేబుళ్లకు ఒకరు చొప్పున రో ఇన్‌చార్జిలను నియమించారు. ఈ ఇన్‌చార్జిలు లెక్కింపు వివరాలను ఎప్పటికప్పుడు సేకరించి, క్రోడీకరించి రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు.
అసెంబ్లీ ఎన్నికలకు మరో 8 నెలల టైం మాత్రమే ఉంది. ఈ క్రమంలో జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ ఎన్నికల్లో టీచర్లు ఇచ్చే తీర్పు రానున్న ఎన్నికలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. దీంతో రూలింగ్ పార్టీతో పాటు అపోజిషన్ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఆయా పార్టీలు తమ మద్దతు ఇచ్చిన వారిని గెలిపించుకునేందుకు ప్రచారం నిర్వహించాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటొచ్చని భావిస్తున్నారు.
తెలంగాణ వార్తల కోసం..