Hyderabad: బాబోయ్‌ పులి.. హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిరుత.. గోల్కొండలో హల్‌చల్‌..!

అలా చిరుత ఉనికిని ధృవీకరించారు. చుట్టుపక్కల ప్రాంతాలలో కొన్ని కుక్కలు కనిపించకుండా పోయినందున, చిరుతపులి వీధి కుక్కలను లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. కొన్ని రోజులుగా మంచిరేవుల, నార్సింగి ప్రాంతాల్లో చిరుత సంచరిస్తుండ‌గా.. గ్రేహౌండ్స్‌ ప్రాంతంలో 4 బోన్లు, ట్రాప్‌ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు.

Hyderabad: బాబోయ్‌ పులి.. హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిరుత.. గోల్కొండలో హల్‌చల్‌..!
Leopard Scare In Hyderabad

Updated on: Jul 29, 2025 | 11:46 AM

హైదరాబాద్‌లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో స్థానికుల్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గోల్కొండ ప‌రిధిలోని ఇబ్రహీంబాగ్‌ మిలిటరీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి. ఈ వీడియోలు ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌ గా మారి చక్కర్లు కొడుతున్నాయి. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు ఇప్ప‌టికే పోలీసులు సమాచార‌మిచ్చారు.

రంగారెడ్డి నుంచి మెల్లిగా బయటకు వచ్చిన చిరుత ప్రయాణం సోమవారం తెల్లవారుజామున రాందేవ్ గూడాలోని మిలటరీ ఏరియాలో రోడ్డు దాటిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అక్కడ శిక్షణ కేంద్రంలోకి ఈ చిరుత ప్రవేశించింది. సోషల్ మీడియాలో ఈ చిరుత సంచారం దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

విశాలమైన మిలిటరీ క్యాంపస్ చుట్టూ ఉన్న జంతువులు, పగ్‌మార్క్‌లను అటవీ అధికారులు అనుసరించారు. అలా చిరుత ఉనికిని ధృవీకరించారు. చుట్టుపక్కల ప్రాంతాలలో కొన్ని కుక్కలు కనిపించకుండా పోయినందున, చిరుతపులి వీధి కుక్కలను లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. కొన్ని రోజులుగా మంచిరేవుల, నార్సింగి ప్రాంతాల్లో చిరుత సంచరిస్తుండ‌గా.. గ్రేహౌండ్స్‌ ప్రాంతంలో 4 బోన్లు, ట్రాప్‌ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..