Hyderabad: ధమ్‌ మారో ధమ్‌.. ఓల్డ్‌ సిటీ కేంద్రంగా గుప్పుమంటోన్న హుక్కా ధమ్‌..

ఒకప్పుడు హుక్కా అంటే బంజారాహిల్స్ ,జూబ్లీహిల్స్ లాంటి కాస్ట్లి ఏరియాలో గుట్టు చప్పుడు కాకుండా సీక్రెట్ గా పడా బాబులకు మాత్రమే యాక్సెస్ ఉండేవి. కానీ రాను రాను గల్లీ గల్లీకి హుక్కా కల్చర్ విస్తరించింది. పోలీసులు అనేకసార్లు దాడులు చేసి ఎన్ని కేసులు బుక్ చేస్తున్న కొత్త హుక్కా సెంటర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే పేరు మార్చి...

Hyderabad: ధమ్‌ మారో ధమ్‌.. ఓల్డ్‌ సిటీ కేంద్రంగా గుప్పుమంటోన్న హుక్కా ధమ్‌..
Hookah Parlour In Balapur

Edited By: Basha Shek

Updated on: Jul 31, 2023 | 9:28 PM

హైదరాబాద్, జులై 31: ఒకప్పుడు హుక్కా అంటే బంజారాహిల్స్ ,జూబ్లీహిల్స్ లాంటి కాస్ట్లి ఏరియాలో గుట్టు చప్పుడు కాకుండా సీక్రెట్ గా పడా బాబులకు మాత్రమే యాక్సెస్ ఉండేవి. కానీ రాను రాను గల్లీ గల్లీకి హుక్కా కల్చర్ విస్తరించింది. పోలీసులు అనేకసార్లు దాడులు చేసి ఎన్ని కేసులు బుక్ చేస్తున్న కొత్త హుక్కా సెంటర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే పేరు మార్చి… లేదంటే ప్లేస్ మార్చి హుక్కా దందా చేస్తున్న వాళ్లు మాత్రం తమ బుద్ధిని మానుకోవట్లేదు. రకరకాల ఫ్లేవర్లు టెస్టులతో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదకరమైన రసాయనాలు లేబర్ లతో తయారవుతున్న హుక్కా పీల్చడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యుల హెచ్చరిస్తున్నారు. అయితే  డబ్బుకు ఆశపడ్డ కంత్రి గాళ్లు మాత్రం యువత ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రీసెంట్ గా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రకుంటా లో మహేశ్వరం జోన్ ఎస్ ఓటీ  పోలీసులు హుక్కా  పార్లర్ పై దాడి చేశారు.అనుమతి లేని ఛిల్ల్ ఆన్ అనే హుక్కా పార్లర్ పై దాడి చేసి 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నగదు 1,920 మరియు 28 సెల్ ఫోన్స్ స్వాధీన చేసుకున్నారు. హుక్కా పాట్స్ 36, హుక్కా పైప్స్ 52, కయల్ బాక్స్ 15, ఫ్లేవర్ బ్లాక్ నాలుగు,ఫ్లేవర్ లూస్ బాక్స్ 8, మియింట్ ఫ్లేవర్స్ స్మాల్ బాక్సెస్ 8, అల్యూమినియం ఫిల్టర్స్ రెండు, మౌత్ ఫిల్టర్స్ రెండు స్వాధీనం. చేసుకున్నారు.

అయితే నగరంలో రహస్యంగా నడుస్తున్న హుక్కా సెంటర్స్ కు సప్లై అయ్యే మెటీరియల్ ఓల్డ్ సిటీ కేంద్రంగానే జరుగుతుంది. ఓల్డ్ సిటీలో హుక్కా కల్చర్ మితిమీరి విస్తరించింది. హైదరాబాద్ మొత్తంలో ఎన్ని హుక్కా సెంటర్స్ నడుస్తాయో…. అంతకు డబల్ హుక్కా సెంటర్స్ ఓల్డ్ సిటీలో నడుస్తాయి. ఇంకా చెప్పాలంటే హుక్కా కి హోల్ సేల్ మార్కెట్ గా పాతబస్తీ ఉంటుందని ఎటువంటి సందేహం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..