Hyderabad: సంచలనం రేపుతోన్న పుడింగ్ పబ్ వ్యవహారం.. లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవి

హైదరాబాద్‌లోని పుడింగ్ పబ్‌లో డ్రగ్స్‌ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల పిల్లలు పబ్‌లో ఉన్నారని తేలడంతో అందరి ఇంట్రెస్ట్‌ ఇటువైపే నిలుస్తోంది.

Hyderabad: సంచలనం రేపుతోన్న పుడింగ్ పబ్ వ్యవహారం.. లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవి
Hyderabad Drugs Case
Follow us

|

Updated on: Apr 03, 2022 | 1:48 PM

రాడిసన్ బ్లూ.. అందులో పుడింగ్ మింక్ పబ్.. అక్కడ డ్రగ్స్‌ వాడకం. ఇప్పుడు హైదరాబాద్‌ను షేక్ చేస్తోన్న విషయం ఇదే. హైద్రాబాద్‌లో డ్రగ్స్‌ వాడుతారు.. మత్తుపదార్ధాల సప్లై జరుగుతోంది. పార్టీల్లో వినియోగిస్తారు. పెడ్లర్లు, డీలర్ల ద్వారా మాఫియా నడుస్తోందని తెలుసు.. కానీ ఫస్ట్ టైమ్.. ఓ పబ్‌లో రెడ్ హ్యాండెడ్‌గా డ్రగ్స్ దొరికాయి. అదే ఈ పుడింగ్ మింక్ పబ్. పబ్‌లో డ్రగ్స్ దొరికాయి. అంతే కాకుండా బాత్‌రూమ్‌లో పెద్ద ఎత్తున ప్యాకెట్స్ బయటపడ్డాయి. పబ్‌లోకి ఈ మత్తు పదార్ధాలు ఎలా వచ్చాయి. యాజమాన్యం తీసుకొచ్చిందా.. లేక పెడ్లర్ ఎవరైనా పార్టీలోకి ఎంటరై డ్రగ్స్ సప్లై చేశారా అనేది తేలాల్సి ఉంది.గతంలో ఓ మాజీ ఎంపీ కూతురి పేరు మీద ఈ పబ్ ఉండేది. ప్రస్తుతం దీని మెయింటెనెన్స్ అంతా అభిషేక్ ఉప్పాల చేతుల్లోనే ఉంది. సెంచ్యురీ హోటల్స్ నిర్వాహణ కూడా ఈ అభిషేక్ చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో అభిషేక్‌తో పాటు పబ్ సిబ్బంది ఉన్నారు. అసలు లేట్‌నైట్ పార్టీలో ఏం జరిగింది? ఎంత మంది డ్రగ్స్ వాడారు.. వాటిని ఎవరు సప్లై చేశారనే దానిపై దర్యాప్తు సాగుతోంది.  హోటల్‌ రాడిసన్‌ బ్లూకు బంజారాహిల్స్ పోటీసులు నోటీసులు ఇచ్చారు. డాక్యుమెంట్‌లతో రావాలని మేనేజర్‌కు ఆదేశాలు జారీ చేశారు. గతంలోను రాడిసన్ బ్లూపై పలు ఫిర్యాదు రావడంతో .. భారీ మొత్తంలో చలానాలు వేశారు ఎక్సైజ్ శాఖ పోలీసులు.  కాగా పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఇంత జరుగుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించిన.. బంజారాహిల్స్ SHO శ్రీ శివచంద్రను సీపీ ఆనంద్ సస్పెండ్ చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్‌కు ఛార్జ్ మెమో ఇచ్చారు.

గల్లా ఫ్యామిలీ ప్రెస్ నోట్…

పుడింగ్ మింక్ పబ్‌ రైడ్‌.. పార్టీ‌కి సంబంధించి గల్లా కుటుంబం వివరణ ఇచ్చింది. రాత్రి హైదరాబాద్‌లోని ఓ పబ్‌పై పోలీసులు జరిపిన రైడ్‌లో గల్లా అశోక్ కూడా దొరికినట్టు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో గల్లా అశోక్‌కి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలని మీడియాలో ప్రసారం చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అంటూ గల్లా కుటుంబం విజ్ఞప్తి చేసింది.

తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలపై అంజన్ కుమార్ యాదవ్ వివరణ..

పుడింగ్ మింక్ పబ్ లో తన కుమారుడు ఉన్నట్లు వచ్చిన వార్తపై టీవీ9తో మాట్లాడారు కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్. పబ్ లోఫ్రెండ్ బర్త్ డే పార్టీకే తన కుమారుడు వెళ్లాడని చెప్పారు . హైదరాబాద్ నగరంలో పబ్ కల్చర్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు అంజనీ కుమార్ యాదవ్. హైదరాబాద్ లో పబ్ కల్చర్ పై కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటాలు చేస్తామని చెప్పారు కాంగ్రెస్ నేత.

Also Read: Andhra Pradesh: ఏసీలు, వాషింగ్ మిషన్లు వాడొద్దు.. ప్రజలకు AP SPDCL విజ్ఞప్తి

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023