
Ganesh Immersion: హైదరాబాద్ నగరంలో వినాయకుల నిమజ్జనం ఒక్కొక్కటిగా కొనసాగుతోంది. కొన్ని వినాయకులను ఐదు రోజులకే నిమజ్జనం చేస్తుండగా, మరి కొన్ని వినాయకులను తొమ్మిదవ రోజు, పదకొండవ రోజుకు నిమజ్జనం చేయనున్నారు. అయితే ఈ గణేష్ నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక వ్యాఖ్యలు చేసింది. నిమజ్జనం తేదీపై కొన్ని దుష్టశక్తులు రాద్ధాంతం చేస్తున్నాయని, 9వ తేదీన వినాయక నిమజ్జనం కొనసాగుతుందని సమితి తెలిపింది. హిందూ పండగలపై ఆంక్షలు విధించాలని చూస్తున్నారని మండిపడింది. రేపు హుస్సేన్ సాగర్ చుట్టూ బైక్ ర్యాలీ నిర్వహిస్తామని ఉత్సవ సమితి వెల్లడించింది. ఎలాంటి అపశృతి జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలిపింది.
అయితే గైడ్‌లైన్స్ అంటూ హిందూ పండగలపై ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. కుంటల ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ లేదని, బతుకమ్మ ఉత్సవాలపై ఉన్న శ్రద్ద వినాయక ఉత్సవాలపై ఎందుకు లేదని సమితి సభ్యులు ప్రశ్నించారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించాలని గణేష్ ఉత్సవ సమితి కోరింది. భక్తుల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతిస్తోందని ఆరోపించింది. లౌడ్ స్పీకర్లు తీసేయాలని కోర్టు ఆదేశించింది. ఎన్ని ప్రార్థనా స్థలాల్లో స్పీకర్లు తొలగించారు అంటూ ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి