Vijaya Milk Price Hiked: సామాన్యుడికి మరో షాక్.. విజయ డెయిరీ పాల ధర పెంపు
Vijaya Milk Price Hiked: ముందే నిత్యవసర సరుకుల ధరలు మండిపోతుంటే.. పాల ధరలు కూడి దూసుకుపోతున్నాయి. ప్రతి రోజు అవసరమయ్యే పాల ధరలకు..
Vijaya Milk Price Hiked: ముందే నిత్యవసర సరుకుల ధరలు మండిపోతుంటే.. పాల ధరలు కూడి దూసుకుపోతున్నాయి. ప్రతి రోజు అవసరమయ్యే పాల ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇప్పటికే పాల ధరలు పెరిగిపోతుండగా, తాజాగా విజయ డెయిరీ పాల ధరను పెంచింది. గేదె, ఆవు పాల ధరలపై లీటర్‌కు రూ.4 చొప్పున పెంచుతున్నామని బోర్డు ప్రకటించింది. లీటర్ టోల్డ్ మిల్క్ ధర రూ.51 నుంచి రూ.55 వరకు పెరిగింది. అర లీటర్ పాల ధర రూ.26 నుంచి రూ.28కి చేరింది. ఇక డబుల్ టోల్డ్ మిల్క్ అర లీటర్ ధర రూ.24 నుంచి రూ.26కు చేరగా, ఆవు పాలు అర లీటర్ ధర రూ.26 నుంచి రూ.28కి చేరింది.
డైట్ మిల్క్ ధర రూ.23 నుంచి రూ.25కు చేరినట్లు తెలిపింది. అయితే పాడి రైతులతో సమావేశం నిర్వహించి ఈ ధర పెంపు నిర్ణయం తీసుకోవాలని భావించినా.. ఎలాంటి సమావేశం నిర్వహించకుండానే ధరలను పెంచేసింది. ఇక నెలవారీ కార్డులు తీసుకున్న వారికి సెప్టెంబర్ 10,13 తేదీల వరకు పాత ధరలే వర్తిస్తాయని డెయిరీ యాజమాన్యం తెలిపింది. అయితే గుట్టుచప్పుడు కాకుండా మూడు రోజుల కిందటనే ధరలు పెంచినట్లు తెలుస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి