Hyderabad: పాయల్ మృతదేహం లభ్యం.. అదే ప్లేస్‌లో 30 మంది సూసైడ్‌.. ఎందుకిలా జరుగుతోంది..?

Durgam Cheruvu Cable Bridge: హైదరాబాద్‌లో సైట్‌ సీయింగ్‌కు అందాల స్పాట్‌.. ఇప్పుడు ఆత్మహత్యలకు హాట్‌ స్పాట్‌. దుర్గంచెరువు @ సూసైడ్ స్పాట్ అన్నట్టు మారింది పరిస్థితి. చెరువు చుట్టూ 70 సీసీ కెమెరాలు.. కేబుల్ బ్రిడ్జ్ మీద 24 గంటల పోలీస్ పహారా ఉంటుంది.

Hyderabad: పాయల్ మృతదేహం లభ్యం.. అదే ప్లేస్‌లో 30 మంది సూసైడ్‌.. ఎందుకిలా జరుగుతోంది..?
Durgam Cheruvu Cable Bridge

Updated on: Jul 14, 2023 | 6:54 PM

Durgam Cheruvu Cable Bridge: హైదరాబాద్‌లో సైట్‌ సీయింగ్‌కు అందాల స్పాట్‌.. ఇప్పుడు ఆత్మహత్యలకు హాట్‌ స్పాట్‌. దుర్గంచెరువు @ సూసైడ్ స్పాట్ అన్నట్టు మారింది పరిస్థితి. చెరువు చుట్టూ 70 సీసీ కెమెరాలు.. కేబుల్ బ్రిడ్జ్ మీద 24 గంటల పోలీస్ పహారా ఉంటుంది. అయినా ఇక్కడ ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు పోలీసులు. అత్యాధునిక టెక్నాలజీతో.. హైదరాబాద్‌కు తలమానికంగా నిర్మించిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఆత్మహత్యలకు కేంద్రంగా మారుతోంది. 2020లో ప్రారంభమైన కేబుల్ బ్రిడ్జిపై ఇప్పటిదాకా 30మంది సూసైడ్ చేసుకున్నారు. లేటెస్ట్‌గా పాయల్‌ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. గురువారం పాయల్ (17) కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకింది. నిన్నటి నుంచి ఆమె కోసం గాలించగా.. శుక్రవారం మృతదేహం లభ్యమైంది. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన పాయల్ సూసైడ్‌కి ప్రేమ వ్యవహారం కారణమని పోలీసులు పేర్కొన్నారు. ఆమె స్నేహితురాలి ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బ్రిడ్జిపై పోలీస్ పెట్రోలింగ్‌.. సీసీ కెమెరాలు ఉన్నాయి.. అయినా సూసైడ్‌ చేసుకునే వారిని నియంత్రించలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎంతోమంది నగరవాసులు, పర్యాటకులు వచ్చే అందమైన కేబుల్ బ్రిడ్జిపై మరింత నిఘా పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది.

మూడు నెలల క్రితమే పాయల్ హైదరాబాద్‌కు వచ్చిందన్నారు ఆమె తండ్రి. ముందు రోజే రాత్రే ఆమెతో మాట్లాడామని, ఆత్మహత్య చేసుకుంటుందని ఏమాత్రం అనుమానం వచ్చినా ఆగమేఘాల మీద వచ్చి కాపాడుకునేవాళ్లమని పాయల్‌ తండ్రి వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మాధాపూర్‌లోని ఓ ఇంట్లో హౌస్‌మేడ్‌గా పనిచేస్తున్న పాయల్.. ఓ యువకుడిని ప్రేమించిందని.. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పగా.. వారి ప్రేమను కుటుంబసభ్యులు ఒప్పుకోలేదని సమాచారం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..