Jubilee Hills ByPoll Results: జూబ్లీహిల్స్‌‌లో హోరాహోరీ.. ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ..

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక కౌంటింగ్ హోరాహోరిగా కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌కు 44 ఓట్ల ఆధిక్యం వచ్చింది. రెండు, మూడు, నాలుగు రౌండ్‌లలోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక కౌంటింగ్ లో ముందుగా పోస్టల్‌ ఓట్ల లెక్కింపు జరిగింది. దీనిలో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.

Jubilee Hills ByPoll Results: జూబ్లీహిల్స్‌‌లో హోరాహోరీ.. ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ..
Jubilee Hills Bypoll

Updated on: Nov 14, 2025 | 10:37 AM

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక కౌంటింగ్ హోరాహోరిగా కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌కు 44 ఓట్ల ఆధిక్యం వచ్చింది. రెండు, మూడు, నాలుగు రౌండ్‌లలోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక కౌంటింగ్ లో ముందుగా పోస్టల్‌ ఓట్ల లెక్కింపు జరిగింది. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో 101 పోస్టల్‌ ఓట్లు పోలవగా…కాంగ్రెస్‌కు 3 ఓట్ల అధిక్యం వచ్చింది. కాంగ్రెస్‌కు 39 ఓట్లు రాగా…BRSకు 36, BJPకి 10 ఓట్లు వచ్చాయి.

  • నాలుగో రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం
  • నాలుగో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 9567 ఓట్లు
  • బీఆర్ఎస్ పార్టీకి – 6020 ఓట్లు
  • 10వేల ఓట్లకు చేరువ అవుతున్న కాంగ్రెస్ లీడ్

ఉప ఎన్నిక కౌంటింగ్‌ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో జరుగుతోంది. 186 మంది సిబ్బంది లెక్కింపులో పాల్గొంటున్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతితో 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. పదిరౌండ్లలో జరిగే కౌంటింగ్‌లో ఒక్కో రౌండ్‌ ఫలితానికి 40 నిమిషాల సమయం పడుతుంది.

Jubilee Hills ByPoll Result 2025 Live Updates కోసం ఇక్కడ క్లిక్ చేయండి..