నందమూరి కుటుంబంలో అంతులేని విషాదం. తారకరత్న ఇకలేరనే వార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఇద్దరికీ సోదరుడి భౌతికకాయాన్ని చూసి కళ్లు చెమర్చాయి. ఆత్మీయుల్ని కోల్పోయిన బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసంటూ.. అభిమానులకు పదేపదే జాగ్రత్తలు చెప్పే జూనియర్ NTR ఇప్పుడు తారకరత్న మరణంతో మరింత డిస్ట్రబ్ అయినట్టు కనిపించారు. కల్యాణ్‌రామ్, జూనియర్ NTR ఇద్దరూ చాలాసేపు మౌనంగానే ఉండిపోయారు. అటు.. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గరి బంధువైన YCP ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. NTRతోను, కల్యాణ్‌రామ్‌తోను చాలాసేపు మాట్లాడారు.
బెంగళూరులో తారకరత్నకు ట్రీట్‌మెంట్ జరుగుతున్నప్పుడు NTR, కల్యాణ్‌రామ్‌తోపాటు విజయసాయిరెడ్డి కూడా వెళ్లి చూసొచ్చారు. కోలుకుంటాడనే ఆశించారు.. కానీ ఇలా జరిగేసరికి ఏ ఒక్కరూ కూడా తారకరత్న మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. హైదరాబాద్ శివారు శంకరపల్లిలోని మోకిల దగ్గర ఇంటిని చాలా ముచ్చటపడి కట్టించుకున్నారు తారకరత్న. ఇంటీరియర్ డిజైన్ మొదలు ప్రతిదీ తనకు నచ్చినట్టు, తన అభిరుచికి తగ్గట్టు ప్లాన్ చేసుకున్నారు. భార్య ముగ్గురు పిల్లలతో జీవితం హాయిగా సాగిపోతున్న సమయంలో హార్ట్ ఎటాక్ రూపంలో మృత్యువు కబళించేసింది.
కోలుకుని తిరిగొస్తాడనుకున్నారు. మళ్లీ ఆ చిరునవ్వులు చూస్తామనుకున్నారు. చికిత్సకు స్పందిస్తాడని.. మిరాకిల్ జరుగుతుదందని ఎదురు చూశారు.. తారకరత్నను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపుతూ తారకరత్న కన్నుమూశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..