‌Hyderabad: ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణం.. ఫీర్జాదిగూడలోని ప్రైవేట్‌ కాలేజీలో..

|

Feb 13, 2023 | 8:03 PM

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో ఇంటర్‌ విద్యార్థిని రమదేవి సూసైడ్‌ కలకలం రేపుతోంది. నాగర్‌కర్నూల్‌జిల్లా బల్మూర్‌ మండలం చెంచుగూడకు చెందిన నిమ్మల రమాదేవి..

‌Hyderabad: ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణం.. ఫీర్జాదిగూడలోని ప్రైవేట్‌ కాలేజీలో..
Crime News
Follow us on

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో ఇంటర్‌ విద్యార్థిని రమదేవి సూసైడ్‌ కలకలం రేపుతోంది. నాగర్‌కర్నూల్‌జిల్లా బల్మూర్‌ మండలం చెంచుగూడకు చెందిన నిమ్మల రమాదేవి, హైదరాబాద్‌ శివారులోని ఫీర్జాదిగూడలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతోంది. ఏమైందో తెలియదు కానీ, రమాదేవి హాస్టల్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఐతే ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం విద్యార్థి డెడ్‌బాడీని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించింది. రమాదేవి ఎక్కడుందో, ఏమైపోయిందో విద్యార్థిని తల్లిదండ్రులకు కూడా కళాశాల యాజమాన్యం పూర్తి సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ విషయం తెలిసిన విద్యార్థి సంఘాలు ఫీర్జాదిగూడలోని శ్రీ చైతన్య కాలేజీ గేటు దగ్గర ఆందోళనకు దిగాయి. కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రమాదేశి పేరెంట్స్‌ కూడా కాలేజీ దగ్గరికి చేరుకున్నారు. లోపలికి వెళ్లకుండా కాలేజీ సిబ్బంది అడ్డుకున్నారు. గేటుకు తాళం వేశారు. దాంతో విద్యార్థి సంఘాల నేతలు అక్కడే ఆందోళనకు దిగారు. పోలీసులు స్పాట్‌కి చేరుకొని విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. దాంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

రమాదేవి బైపీసీ ఫస్టియర్‌ చదువుతోంది. కాగా.. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. రమాదేవి ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..