Hyderabad: పూరి తిందామని నోట్లో పెట్టుకోబోతే.. కూరలో కనిపించింది చూసి షాక్

ఆకలితో హోటల్‌కు వెళ్లిన ఓ వ్యక్తి పూరి ఆర్డర్ ఇచ్చాడు. వెయిటర్ వేడి వేడి పూరి టేబుల్‌పై తీసుకురాగా.. తినేందుకు కస్టమర్ సిద్ధమయ్యాడు. ఇంతలో పూరి కూరలో కనిపించింది చూసి బిత్తరపోయాడు. డీటేల్స్.....

Hyderabad: పూరి తిందామని నోట్లో పెట్టుకోబోతే.. కూరలో కనిపించింది చూసి షాక్
Poori Curry
Follow us

|

Updated on: Jul 08, 2024 | 5:47 PM

హైదరాబాద్‌లోని ఓ హోటల్‌కు.. టిఫిన్ చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ఊహించని అనుభవాన్ని చవిచూశాడు. బాగా ఆకలిగా ఉండటంతో.. అతను పూరి ఆర్డర్ ఇచ్చాడు. హెటల్ అతను వేడివేడిగా ప్లేట్ పూరి తెచ్చి అతనికి ఇచ్చాడు. ఇష్టంగా తిందా అనుకుంటున్న సమయంలో.. ఆ పూరి కూరలో కనిపించింది చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఒక్కసారిగా కక్కు వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఆ కస్టమర్ నార్మల్ అవ్వడానికి 10 నిమిషాల సమయం పట్టింది. ఇంతకూ ఆ పూరి కూరలో ఏం కనిపించింది అనేగా మీ డౌట్. పురుగు అండీ బాబు. అది కూడా ఏ దోమ, ఈగ సైజ్ ఉన్న పురుగు కాదు.. ఏకంగా బొద్దింగ సైజ్‌లో ఉంది ఆ పురుగు.

డీటేల్స్‌లోకి వెళ్తే…హైదరాబాద్ గడ్డి అన్నారంలోని ఓ టిఫిన్ సెంటర్‌కు వెళ్లిన కస్టమర్ పూరి ఇవ్వాలని కోరాడు. వెయిటర్ వేడి వేడిగా పూరి తెచ్చివ్వగా.. ఆవురావురు మంటూ రెండు బైట్స్ తినేశాడు. ఇంతలో.. పూరి కూరలో ఓ పెద్ద సైజు పురుగు కనిపించింది. దాన్ని చూడగానే.. ఆ కస్టమర్‌కు కడుపులో దేవినట్లైంది. ఇదేంటని.. హెటల్ వాళ్లను ప్రశ్నించగా.. ఏదో పొరపాటు జరిగింది.. మరోసారి రిపీట్ కాకుండా చూసుకుంటామని చెప్పకుండా.. కేర్‌లెస్‌గా ఆన్సర్ ఇచ్చారు. దీంతో.. సదరు కస్టమర్‌కు ఏం చెయ్యాలో పాలుపోక.. అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. అందుకు సంబంధించిన వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

ఇష్టమున్నంత రేట్లు పెడతారు.. ఆ రేట్లకు అడ్జెస్ట్ అయ్యే కస్టమర్ అక్కడికి వెళ్తాడు. అయినా ఈ రకంగా ఫుడ్ ఇస్తే ఏమనుకోవాలి. ఫుడ్ విషయంలో మరీ అంత టేస్ట్ లేకపోయినా పర్లేదు కానీ నీట్‌నెస్ మాత్రం పక్కాగా ఉండాలి. లేదంటే.. రోగాలు మాత్రం వెంటాడే అవకాశం ఉంటుంది.  ఇటీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు.. రెస్టారెంట్స్, హోటల్స్, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలలో అదే పనిగా తనిఖీలు చేస్తున్నారు. అయినా కొందరు నిర్వాహకుల్లో మార్పు రాకపోవడం గమనార్హం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

ఈ రంగాలపై ప్రభుత్వం పాలసీ ఏంటి.. బడ్జెట్‎పై కేసీఆర్ కౌంటర్..
ఈ రంగాలపై ప్రభుత్వం పాలసీ ఏంటి.. బడ్జెట్‎పై కేసీఆర్ కౌంటర్..
బిగ్‍బాస్ 8 కోసం కింగ్ నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్..
బిగ్‍బాస్ 8 కోసం కింగ్ నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్..
డిగ్రీ అర్హతతో 17,727 కేంద్ర కొలువులు..2 రోజుల్లోముగుస్తున్నగడువు
డిగ్రీ అర్హతతో 17,727 కేంద్ర కొలువులు..2 రోజుల్లోముగుస్తున్నగడువు
షుగర్‌ టెస్ట్ ఏ సమయంలో చేసుకుంటే మంచిది..
షుగర్‌ టెస్ట్ ఏ సమయంలో చేసుకుంటే మంచిది..
మూసి ఉన్న ఇల్లు.. తలుపు తెరవగానే బయటకు వచ్చిన 26 కొండచిలువలు..
మూసి ఉన్న ఇల్లు.. తలుపు తెరవగానే బయటకు వచ్చిన 26 కొండచిలువలు..
మళ్లీ అమ్మవుతోన్న బాపు బొమ్మ.. బేబీ బంప్ ఫొటోస్ షేర్ చేసిన ప్రణీత
మళ్లీ అమ్మవుతోన్న బాపు బొమ్మ.. బేబీ బంప్ ఫొటోస్ షేర్ చేసిన ప్రణీత
జులై 26, 27 తేదీల్లో గురుకుల విద్యాలయాల్లో స్పాట్‌ అడ్మిషన్లు
జులై 26, 27 తేదీల్లో గురుకుల విద్యాలయాల్లో స్పాట్‌ అడ్మిషన్లు
రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. రూ. 500 బోనస్‌తో పాటు..
రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. రూ. 500 బోనస్‌తో పాటు..
వాడేసిన టీ పొడిని పడేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే అస్సలు పడేయరు
వాడేసిన టీ పొడిని పడేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే అస్సలు పడేయరు
మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌..
మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌..