Hyderabad Traffic Alert: మంగళవారం హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఆ మార్గాల్లో వాహనాలు దారిమళ్లింపు

|

Aug 14, 2023 | 9:00 PM

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం (ఆగస్టు 15) ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. గోల్కొండలోని రాణిమహల్ లాన్స్‌లో జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు జారీ చేశారు. గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. దీంతో రామ్‌దేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట వరకూ రోడ్డు బంద్‌ ఉంటుంది. అటుగా వచ్చే వాహనాలను రామ్‌దేవ్‌గూడ నుంచి..

Hyderabad Traffic Alert: మంగళవారం హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఆ మార్గాల్లో వాహనాలు దారిమళ్లింపు
Traffic Restrictions
Follow us on

హైదరాబాద్‌, ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం (ఆగస్టు 15) ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. గోల్కొండలోని రాణిమహల్ లాన్స్‌లో జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు జారీ చేశారు. గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. దీంతో రామ్‌దేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట వరకూ రోడ్డు బంద్‌ ఉంటుంది. ఐతే A (గోల్డ్), A (పింక్), B (నీలం) కారు పాస్ హోల్డర్‌లకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.

సికింద్రాబాద్‌, బంజారాహిల్స్‌, మాసబ్‌ ట్యాంక్‌, మెహదీపట్నం వైపు నుంచి ఎ (గోల్డ్‌), ఎ (పింక్‌), బి (బ్లూ) కార్‌ పాస్‌లతో వాహనాల్లో వచ్చే ఆహ్వానితులు రేతిబౌలి, నానల్‌నగర్‌ జంక్షన్‌ల మీదుగా వచ్చి బాలికా భవన్‌ వైపు ఎడమవైపుకి వెళ్లాలని సూచించారు. లంగర్ హౌస్ ఫ్లైఓవర్, టిప్పు ఖాన్ బ్రిడ్జ్, రామ్‌దేవ్‌గూడ జంక్షన్, మాకై దర్వాజా, గోల్కొండ ఫోర్ట్ గేట్ వైపు వెళ్లొచ్చని తెలిపారు. డి (ఎరుపు) కారు పాస్‌లతో వాహనాల్లో వచ్చే అతిధులు షేక్‌పేట్ నాలా, టోలీచౌకి, సెవెన్ టూంబ్స్ వైపు, బంజారా దర్వాజ మీదుగా వచ్చి గోల్కొండలోని ప్రియదర్శిని స్కూల్‌లో దిగి, తమ వాహనాలను ప్రియదర్శిని స్కూల్ లోపల పార్క్ చేయాలని తెలిపారు.

‘ఈ’ కారు పాస్‌లు ఉన్న వాహనాలు అంటే తమ వాహనాల్లో వేదిక వద్దకు వచ్చే ప్రజలు లంగర్ హౌస్ ఫ్లైఓవర్ కింద నుంచి వచ్చి యూ టర్న్ తీసుకొని ఫతే దర్వాజా వైపు ఎడమవైపు మళ్లి ఫతే దర్వాజా, జనరల్ సమీపంలోని హుడా పార్క్ వద్ద వాహనాలను పార్క్ చేయాలని సూచించారు. షేక్‌పేట్, టోలీచౌకి నుంచి వచ్చే ప్రజలు తమ వాహనాలను సెవెన్ టూంబ్స్ లోపల పార్క్ చేయవచ్చు. సాధారణ ప్రజలు వేదిక వద్దకు చేరుకోవడానికి, తిరిగి వెళ్లడానిక ఉచిత ఆర్టీసీ బస్సులను ఎక్కవచ్చని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.