Telangana Weather: తెలంగాణలో 5 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

|

Jun 19, 2024 | 12:59 PM

హైదరాబాద్‌ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్ ఇచ్చింది. నగరంలో ఐదురోజులపాటు వర్షాలుంటాయని చెప్పింది. ఈదురు గాలులతో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి...

Telangana Weather: తెలంగాణలో 5 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
Telangana Weather
Follow us on

హైదరాబాద్‌ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది.  రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. జూన్ 23 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆదివారం వరకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.

జూన్ 19, బుధవారం… ఆదిలాబాద్, కుమురం భీమ్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లె, భూపాలపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, జనగాం, ఖమ్మం, భువనగిరి, నల్గొండ, మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

జూన్ 20, గురువారం…. నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, భూపాలపల్లి, ములుగులో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

జూన్ 21న, శుక్రవారం… ఆదిలాబాద్, కుమురం భీమ్, మంచిర్యాల, జె.భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, బి.కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని ఐఎండి అంచనా వేసింది.

ఉత్తర తెలంగాణ జిల్లాలైన.. ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లె, జె.భూపాలపల్లి, మెదక్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, ములుగు, కొత్తగూడెం జిల్లాలతో ఉరుమలు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

మే 18, మంగళవారం తెలంగాణలో ములుగులో అత్యధికంగా అంటే 96.3 మి.మీ వర్షపాతం నమోదైంది.  హైదరాబాద్‌లో అత్యధికంగా షేక్‌పేటలో 3.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.