Awards Ceremony: ఘనంగా IMA బ్రాంచ్ ప్రారంభోత్సవం.. మీడియా అవార్డుల ప్రదానోత్సవం..

|

Dec 13, 2021 | 1:35 PM

వైద్య రంగానికి కరోనా ఒక ఛాలెంజ్ విసిరిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కరోనా సమయంలో వైద్యుల సేవలు మరవలేమని చెప్పారు...

Awards Ceremony: ఘనంగా IMA బ్రాంచ్ ప్రారంభోత్సవం.. మీడియా అవార్డుల ప్రదానోత్సవం..
G.kishan Reddy
Follow us on

వైద్య రంగానికి కరోనా ఒక ఛాలెంజ్ విసిరిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కరోనా సమయంలో వైద్యుల సేవలు మరవలేమని చెప్పారు. ప్రాణాలకు తెగించి డాక్టర్లు కోవిడ్ చికిత్స అందించారని గుర్తు చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బంజారాహిల్స్ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన బంజారాహిల్స్ IMA కొత్త బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ చల్లగాలి ప్రభు కుమార్ వారి టీమ్‎కి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించిన మీడియా ప్రతినిధులను కరోనా వారియర్స్ అవార్డులతో సత్కరించారు కిషన్ రెడ్డి.

కోవిడ్ టైమ్‎లో ప్రాణాలు పణంగా పెట్టి శ్రమించిన వైద్యులు, ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల సేవలను అధ్యక్షులు డాక్టర్ ప్రభు కుమార్ చల్లగాలి కొనియాడారు. బ్రాంచ్ ప్రారంబోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన డాక్టర్ ప్రభు కుమార్ చల్లగాలికి అభినందనలు తెలిపారు ఐఎంఏ జాతీయ అధ్యక్షులు జయలాల్. హైదరాబాద్ తాజ్ డెక్కన్‎లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి బ్రిటీష్ డిప్యూటీ హై కమీషనర్ ఆండ్రూ ప్లెమింగ్, ఐఎంఏ నేషనల్ ప్రెసిడెంట్ ఏ. జయలాల్, మాజీ మంత్రి, నటులు బాబు మోహన్, లిడ్ క్యాప్ ఛైర్మన్ రాజశేఖర్ కాకుమాను, ఎన్ గౌతమ్ రావు, ఛైర్మన్, తెలంగాణ ఇంజనీరింగ్ అండ్ ప్రొఫెషనల్ కాలేజెస్ మేనేజ్ మెంట్ అసోసియేషన్, స్పెషల్ గెస్ట్ డాక్టర్ మోహన్ వంశీ, ఒమెగా హాస్పటల్స్, ఐఎంఏ అఫీషియల్స్ డాక్టర్లు ఈ. రవీంద్ర రెడ్డి, ఐఎంఏ నేషనల్ వైస్ ప్రెసిడెంట్, లవ్ కుమార్ రెడ్డి, ఇమీడియేట్ పాస్ట్ ప్రెసిడెంట్ మాచినేని సంపత్ రావు, ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ బుద్దిగ నరేందర్ రెడ్డి, గౌరవ కార్యదర్శి హాజరయ్యారు.

ఏ విభాగానికి అవార్డులు

బెస్ట్ డిబేట్ కేటగిరిలో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్, కరోనా రీసర్చ్ ప్రొడ్యూసర్‎గా కొండవీటి శివనాగరాజు, కరోనా వారియర్‎గా ఎలెందర్ రెడ్డిని ఐఎంఏ అవార్డులతో సత్కరించింది. టీవీ-5 మూర్తికి బెస్ట్ ప్రైమ్ టైమ్ షో, పీవి రమణ కుమార్, అసోసియేట్ ఎడిటర్ న్యూస్ 18 నెట్ వర్క్ బెస్ట్ కేవిడ్ యాంకర్‎గా, సిద్దం మాధవి టీవీ5కు బెస్ట్ హెల్త్ అవేర్ నెస్‎గా అవార్డులను ప్రదానం చేశారు.

ఇక డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అవార్డు బి. శ్రీనివాసరెడ్డి, డీసీపీ, జనగాంకు ఇవ్వగా.. కొవిడ్ వారియర్స్ అవార్డులను 1. బి. నరేందర్, టీవీ5 2. కే రాజేష్, ఛీప్ కోఆర్డినేటర్, ఐన్యూస్, 3. కొన్నోజు రాజు, ఎన్టీవీ 4. కే. విక్రమ్ రెడ్డి, సాక్షిటీవీ, 5. ఏ ప్రవీణ్, ఏబీఎన్, 6. వి. లక్ష్మీ, వీ6, 7. టి. వంశీ కృష్ణ, టీన్యూస్, 8. ఆర్ ఏలేందర్ రెడ్డి, టీవీ9, 8. స్వీటీరెడ్డి, హెచ్ ఎంటీవీ. 9. పి. రాధిక, 10టీవీ, 10. కనిజ గారారి, బెస్ట్ కొవిడ్ రైటర్, 11. ఎస్. ధనుంజయ, కెమెరామెన్ 10టీవీ, 12. అమృత దిద్యాల, టైమ్స్ ఆఫ్ ఇండియా, 13. శేఖర్, ది హిందూ, 14.ఎం బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్ 18 కి ప్రదానం చేశారు.

Read Also.. CM KCR: టార్గెట్ బీజేపీ.. రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్న సీఎం కేసీఆర్.. తమిళనాడు పర్యటన వెనుక..