AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో దారుణం.. చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసిన రాక్షసుడు..

హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన హత్యోదంతం వెలుగు చూసింది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త, ఆమెను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహమ్మద్ ముస్తఫా, అజ్మేరా బేగం దంపతులు బాలాపూర్‌లోని న్యూ బాబా నగర్‌లో నివాసముంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి జరిగిన తీవ్ర వాగ్వాదంతో ఆవేశానికి గురైన భర్త, ఇంట్లోనే భార్యను కత్తితో హతమార్చాడు. అసలేం జరిగింది..? పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లో దారుణం.. చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసిన రాక్షసుడు..
Balapur Murder
Jyothi Gadda
|

Updated on: Oct 13, 2026 | 5:25 PM

Share

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మానవత్వం సిగ్గుపడేలాంటి అమానుష ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు తారాస్థాయికి చేరడంతో ఓ కిరాతక భర్త తన భార్యను కన్న పిల్లల ముందే అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ దారుణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహమ్మద్ ముస్తఫా, అజ్మేరా బేగం (32) దంపతులు. వీరికి వివాహమై సుమారు 15 ఏండ్లు అవుతోంది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఉపాధి వెతుక్కుంటూ బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చిన ఈ కుటుంబం, బాలాపూర్ పరిధిలోని న్యూ బాబా నగర్‌లో నివాసముంటోంది. దంపతుల మధ్య గత కొంతకాలంగా కొన్ని కుటుంబ విషయాలపై మనస్పర్థలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చెలరేగింది. మాటా మాటా పెరగడంతో ఇద్దరి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. ఆవేశాన్ని అణచుకోలేకపోయిన నిందితుడు మహమ్మద్ ముస్తఫా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇంట్లోనే ఉన్న పదునైన కత్తిని తీసుకుని, అక్కడే భయంతో వణికిపోతున్న ముగ్గురు చిన్న పిల్లల కళ్ల ముందే భార్య అజ్మేరా బేగం గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. భార్యను దారుణంగా హతమార్చిన అనంతరం నిందితుడు వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.

ఇవి కూడా చదవండి

తల్లి మృతి చెందడంతో ఆ చిన్న పిల్లలు భయంతో కేకలు వేశారు. వారి రోదనలు విన్న చుట్టుపక్కల స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాలాపూర్ పోలీసులు, క్లూస్ టీమ్‌తో కలిసి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడు ముస్తఫా కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పాపికొండల విహారయాత్రకు అధికారుల గ్రీన్ సిగ్నల్
పాపికొండల విహారయాత్రకు అధికారుల గ్రీన్ సిగ్నల్
ఎలక్ట్రిక్ కారుపై సోలార్ ప్యానెల్స్‌.. ఛార్జింగ్ ఖర్చు తగ్గుతుందా
ఎలక్ట్రిక్ కారుపై సోలార్ ప్యానెల్స్‌.. ఛార్జింగ్ ఖర్చు తగ్గుతుందా
జ్ఞాపకాల కోసం 112 ఏళ్ల పురాతన ఇంటిని 9 కి.మీ. దూరం తరలించిన మహిళ!
జ్ఞాపకాల కోసం 112 ఏళ్ల పురాతన ఇంటిని 9 కి.మీ. దూరం తరలించిన మహిళ!
ఎరక్కపోయి ఇరుకున్నాడు.. యూట్యూబ్‌లో చూసి బంగారం కోసం వేట..
ఎరక్కపోయి ఇరుకున్నాడు.. యూట్యూబ్‌లో చూసి బంగారం కోసం వేట..
రవి, శుక్రుల యుతి..వీరికి కొత్త ఉద్యోగ ఆఫర్లు ఖాయం..!
రవి, శుక్రుల యుతి..వీరికి కొత్త ఉద్యోగ ఆఫర్లు ఖాయం..!
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్..
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్..
ప్రియుడి కోసం భారత్‌కు రష్యా యువతి
ప్రియుడి కోసం భారత్‌కు రష్యా యువతి
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తిన్నారా.. కరివేపాకు వీరికి యమడేంజర్..
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తిన్నారా.. కరివేపాకు వీరికి యమడేంజర్..
8 నెలల కష్టం ఒక్క నెలలోనే వృథా.. మళ్లీ రంగంలోకి బిట్టు తబాహి!
8 నెలల కష్టం ఒక్క నెలలోనే వృథా.. మళ్లీ రంగంలోకి బిట్టు తబాహి!
నెటిజన్ అసభ్యకరమైన కామెంట్స్.. కౌంటరిచ్చిన వేణు స్వామి భార్య
నెటిజన్ అసభ్యకరమైన కామెంట్స్.. కౌంటరిచ్చిన వేణు స్వామి భార్య