AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ.. తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్ ప్రకంపనలు..

జన్వాడ రేవ్‌ పార్టీ కేసులో A2గా ఉన్న రాజ్‌ పాకాల ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు ఎక్సైజ్ అధికారులు. రేవ్ పార్టీలో ఇప్పటివరకు డ్రగ్స్ దొరకనట్లుగా ఆనవాళ్లు లేవని.. అక్కడ దొరికిన అక్రమ మద్యం ఎలా వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నామని తెలిపారు. కేసులో ఏ-2గా ఉన్న రాజ్ పాకాల ప్రస్తుతం పరారీలో ఉన్నారన్నారు.

Hyderabad: జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ.. తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్ ప్రకంపనలు..
Janwada Farmhouse Party
Shaik Madar Saheb
|

Updated on: Oct 27, 2024 | 2:00 PM

Share

ఓ వీకెండ్ పార్టీ ఇప్పుడు పొలిటికల్‌గా హాట్ టాపిక్ అయ్యింది.. హైదరాబాద్‌ శివారు జన్వాడలో జరిగిన రేవ్‌ పార్టీ జరగడం.. తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది.. పార్టీలో పాల్గొన్న వాళ్లలో డ్రగ్స్‌ తీసుకున్నట్టు తేలింది ఒకరే అయినా.. హైప్రొఫైల్‌ కేసు కావడంతో.. ఈ న్యూస్‌ బయటకు రావడం ఆలస్యం రాజకీయంగానూ విమర్శలు మొదలయ్యాయి.. శనివారం రాత్రి హైదరాబాద్ శివారు జన్వాడలో ఓ రేవ్‌ పార్టీ జరిగింది.. రాజ్‌ పాకాలకు చెందిన ఈ ఫామ్‌హౌస్‌లో పార్టీకి 35 మంది హాజరయ్యారు. ఈ పార్టీపై పోలీసులకు నిన్న రాత్రి ఫిర్యాదు అందడంతో.. నార్సింగి పోలీసులు, సైబరాబాద్ SOT బృందాలతోపాటు ఎక్సైజ్ పోలీసులు ఫామ్‌హౌస్‌కి వెళ్లి తనిఖీలు చేశారు. అక్కడ హై ఫై పార్టీ జరుగుతున్నట్టు గుర్తించారు. పార్టీలో ఉన్న వారికి డ్రగ్స్ టెస్టు చేస్తే.. విజయ్‌ మద్దూరికి కొకైన్ పాజిటివ్ వచ్చింది. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో అనుమతి లేని విదేశీ మద్యం, గేమింగ్‌ కాయిన్స్‌, క్యాసినో మెటీరియల్‌ గుర్తించారు.. రాజ్‌పాకాలపై NDPS, ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. రేవ్‌పార్టీ కేసులో A1-గా కార్తీక్‌.. A-2గా రాజ్‌ పాకాల పేర్లను చూపించారు.

హైదరాబాద్ శివారు జన్వాడ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్‌ పార్టీకి 35 మంది హాజరయ్యారు.. వీరిలో 14 మంది మహిళలు కూడా ఉన్నారు.. పార్టీలో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించడంతో స్నిఫర్‌ డాగ్స్‌ను కూడా రంగంలోకి దించి పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు.. ఫామ్‌హౌస్‌లో 10 లీటర్ల అనుమతిలేని ఫారిన్ లిక్కర్‌ , 10 ఇండియన్ మేడ్‌ లిక్కర్‌ బాటిల్స్ సీజ్‌ చేశారు.. జన్వాడలో పార్టీకి ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్ నుంచి ఎలాంటి పర్మిషన్ లేదని పోలీసులు తెలిపారు. NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

వీడియో చూడండి..

పార్టీకి హాజరైన వారిలో ప్రముఖులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడీ రేవ్‌ పార్టీ కేసు సంచలనంగా మారింది. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు.. బావమరిది ఫామ్‌హౌస్‌లో రేవ్‌పార్టీలా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సూటిగా ప్రశ్నలు సంధించారు.. అసలైన వ్యక్తిని తప్పించారని వార్తలొస్తున్నాయంటూ కూడా సెటైర్లు వేశారు.. కాంగ్రెస్‌, BRS కాంప్రమైజ్‌ పాలిటిక్స్‌ సిగ్గుచేటు అంటు ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్‌.. దర్యాప్తు పక్కాగా జరగాల్సిందేనన్నారు.. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలంటూ బండిసంజయ్‌ సూచించారు.

ఓ కీలక నేత బావమరిది ఫామ్‌హౌజ్‌లో అసాంఘిక కార్యకలాపాలను చూస్తే.. తెలంగాణ సమాజం సిగ్గుపడుతోందంటూ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌ పేర్కొన్నారు. డ్రగ్స్‌ ఫ్రీ తెలంగాణ అని ప్రభుత్వం అంటుంటే.. తన సొంత బావమరిది ఫామ్‌హౌస్‌లోనే రేవ్‌పార్టీలు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. సోదాలకంటే ముందే 20 మంది వెళ్లిపోయారని సమాచారముందని.. తెలంగాణ సమాజానికి ఏమని సందేశం ఇస్తున్నారంటూ అద్దంకి దయాకర్‌ ఫైర్ అయ్యారు.

లైవ్ వీడియో చూడండి..

Follow Us
ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం..
ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం..
నా పాటకు ప్రాణం పెట్టి ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లిన హీరో..
నా పాటకు ప్రాణం పెట్టి ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లిన హీరో..
నా కోడలు టాప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..
నా కోడలు టాప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..
'ఈ సీజన్‌లో 2000-3000 పరుగులు బాదేస్తా..'
'ఈ సీజన్‌లో 2000-3000 పరుగులు బాదేస్తా..'
మీ స్టవ్ తుడిచేటప్పుడు ఈ చిన్న చిట్కా పాటిస్తే..
మీ స్టవ్ తుడిచేటప్పుడు ఈ చిన్న చిట్కా పాటిస్తే..
ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? 99శాతం మంది..
ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? 99శాతం మంది..
తేనెటీగ కుట్టిందా?ఈ చిట్కాలతో నొప్పి, వాపును వెంటనే తగ్గించుకోండి
తేనెటీగ కుట్టిందా?ఈ చిట్కాలతో నొప్పి, వాపును వెంటనే తగ్గించుకోండి
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?
ప్రభుత్వం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5లక్షల జీవిత బీమా!
ప్రభుత్వం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5లక్షల జీవిత బీమా!
ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు.. ఎలా చెయ్యాలంటే
ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు.. ఎలా చెయ్యాలంటే