వర్షం రాకతో.. మెట్రోకు ఎగబడుతోన్న జనం..!
హైదరాబాద్, సికింద్రాబాద్‌లో భారీ వర్షం పడుతోంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ముందే అప్రమత్తమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు చేపట్టారు. అరగంట ముందే చీకట్లు అలుముకున్నాయి. విడతల వారీగా ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇంటికి వెళ్లాలని జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్ జాం కాకుండా పోలీసులు రంగంలోకి దిగారు. కుంభవృష్టి వర్షాలతో.. హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. అసలే ఇరుకైన నగరం.. […]

హైదరాబాద్, సికింద్రాబాద్‌లో భారీ వర్షం పడుతోంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ముందే అప్రమత్తమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు చేపట్టారు. అరగంట ముందే చీకట్లు అలుముకున్నాయి. విడతల వారీగా ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇంటికి వెళ్లాలని జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్ జాం కాకుండా పోలీసులు రంగంలోకి దిగారు.
కుంభవృష్టి వర్షాలతో.. హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. అసలే ఇరుకైన నగరం.. భారీ వర్షాలతో.. ఫుల్‌గా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో.. చేసేది ఏమీ లేక.. జనాలు మెట్రో బాట పట్టారు. కళ్లు మూసుకుని తెరిచేలోగా.. గమ్యస్థానాలకు చేరిపోతున్నారు. రోడ్డుపై ట్రాఫిక్ జామ్‌తో గంట కుస్తీ పడే వాహనదారులు.. 20 నిమిషాల్లో ఇళ్లకు చేరుకుంటున్నారు. ఒక రకంగా చూస్తే ఇదే బెటర్ కూడా. అయితే.. జనాల రాకతో.. మెట్రో ట్రైన్స్ కిక్కిరిసిపోయాయి. అయితే.. జనం రద్దీతో.. ఓ మెట్రో రైలు 40 నిమిషాల పాటు అక్కడే నిలిచిపోయింది. దాంతో.. ఎల్బీనగర్ టూ అమీర్‌పేట రూట్‌లో మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. అందులోనూ భారీ వర్షంతో.. మెట్రో ట్రాక్స్‌పై ఫుల్లుగా వరద నీరు చేరింది.