111 ఏళ్లనాటి రికార్డ్ బ్రేక్: అప్పటి తర్వాత ఇప్పుడే కుంభవృష్టి..!
తెలంగాణ ప్రాంతంతో పాటు.. అటు ఏపీ జిల్లాలో కూడా వర్షం దంచికొచ్చింది. కాగా.. ముఖ్యంగా హైదరాబాద్‌లో గత మూడు రోజుల నుంచి వర్షం.. కుంభవృష్టిగా పడుతోంది. మునుపెన్నడూ లేని విధంగా.. వర్షం రావడంతో.. ఎక్కడిక్కడ జన జీవనం స్తంభించింది. దాదాపు మోకాళ్లకుపైగా నీరు చేరింది. కొన్ని ప్రాంతాల్లో కార్లు, ద్విచక్రవాహనాలు.. నీటిలో మునిగిపోయాయి. ఫుల్‌గా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో నిన్న కురిసిన వర్షంతో రికార్డు బ్రేక్ చేసింది. దాదాపు 111 ఏళ్లనాటి చరిత్రను బద్దలుకొట్టింది. […]

తెలంగాణ ప్రాంతంతో పాటు.. అటు ఏపీ జిల్లాలో కూడా వర్షం దంచికొచ్చింది. కాగా.. ముఖ్యంగా హైదరాబాద్‌లో గత మూడు రోజుల నుంచి వర్షం.. కుంభవృష్టిగా పడుతోంది. మునుపెన్నడూ లేని విధంగా.. వర్షం రావడంతో.. ఎక్కడిక్కడ జన జీవనం స్తంభించింది. దాదాపు మోకాళ్లకుపైగా నీరు చేరింది. కొన్ని ప్రాంతాల్లో కార్లు, ద్విచక్రవాహనాలు.. నీటిలో మునిగిపోయాయి. ఫుల్‌గా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో నిన్న కురిసిన వర్షంతో రికార్డు బ్రేక్ చేసింది. దాదాపు 111 ఏళ్లనాటి చరిత్రను బద్దలుకొట్టింది.
1908వ సంవత్సరంలో సెప్టెంబర్ తర్వాత ఈ స్థాయిలో వాన కురవడం తొలిసారి. హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నాలాలు, చెరువులు పొంగిపొర్లాయి. రహదారులు గోదారిని తలపించాయి. రహదారుల మీదకు నాలా నీరు పొంగిపొర్లడంతో.. రోడ్లన్నీ జలయమం అయ్యాయి. దీంతో.. కిలో మీటర్ల మేర నీరు నిలిచిపోయింది. మంగళవారం కురిసిన వర్షం రిక్డార్‌ని బ్రేక్ చేసింది. దాదాపు మధ్యాహ్నం 2.30 నుంచి అర్థరాత్రి 12 గంటలకు వరకూ జోరు వాన కురిసింది. దీంతో.. జనాలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.
మంగళవారం కురిసిన వర్షంతో అత్యధికంగా.. సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో 12.1 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదవగా.. ఉప్పల్‌లో 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక అల్వాల్, కాప్రా, మల్కాజిగిరి, మెహిదీపట్నం, చార్మినార్, కుత్బుల్లాపూర్, అంబర్ పేట, గోషామహల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, ముసాపేట్, శేరిలింగంపల్లి, జూబ్లిహిల్స్, బంజారా హిల్స్, యూసఫ్ గూడ, అమీర్‌పేట ప్రాంతాల్లో.. వర్షం బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకూ ఎడతెరపి లేకుండా కుంభవర్షం కురిసింది.
1908లో సెప్టెంబర్ 27న హైదరాబాద్‌లో 15.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ స్థాయిలో.. మరలా ఇప్పుడే వర్షం కురిసింది. కాగా.. మరో రెండు రోజుల పాటు ఈ వర్షం జోరు కొనసాగే పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా.. జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ఇప్పటికే మంత్రి కేటీఆర్ పలు సూచనలు జారీ చేశారు. అలాగే.. హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాల్లో నగర మేయర్ బొంతు రామ్మోహన్ పర్యటించారు.