హైదరాబాద్,జులై26: వర్షాకాలం మొదలైనప్పటి నుంచి హైటెక్ సిటీ ఏరియాలో ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉన్నాయో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. ఐటీ కారిడార్ లోని ప్రయాణికులు ట్రాఫిక్ జామ్ తో నరకం చూస్తున్నారు. సాధారణంగానే హెవీగా ఉండే ట్రాఫిక్, వర్షాల కారణంగా ఐటీ కారిడార్ పూర్తిగా జామ్ అయిపోతుంది. దీంతో హైటెక్ సిటీ సైడ్ వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ప్రయాణికులు రోజు ఆఫీసులకు వెళ్లే టైం లో ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికి చేరుకునే టైంలో ట్రాఫిక్ సమస్య మరి తీవ్రంగా ఉంటుంది. కిలోమీటర్ ప్రయాణించడానికి గంట సమయం వెచ్చించాల్సి వస్తోంది. జాయింట్ సీపీ ట్రాఫిక్ రంగం లోకి దిగి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అయినా కూడా ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ సమస్యలు తీరేలా కనిపించలేదు. హైదరాబాద్ లో వర్షం పడితే ట్రాఫిక్ లో ఎక్కడ వారి పరిస్థితి నరకమే.
సోమవారం సాయంత్రం ఏకంగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఐక్య రోటరీ వద్ద వర్షం లో తడుస్తూ రెండు గంటలు ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారంటే ఇక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెంటనే సీపీ ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ట్రాఫిక్ సమస్యలకు ప్రత్యామ్నాయ పరిష్కారాలు సూచించాలని కోరారు. దీంతో రాత్రికి రాత్రి పోలీసులు మాస్టర్ ప్లాన్ వేశారు. మొత్తం ఐటి కారిడార్ ని మూడు జోన్లుగా విభజించారు. ఒక్కో జోన్ కి ఒక్కో లాగ్ అవుట్ టైం లను ఫిక్స్ చేశారు. జూన్ కి జోన్ కి మధ్య లాగౌట్ టైమ్ కి గంటన్నర గ్యాప్ ఇచ్చారు. దీంతో అందరూ ఒకేసారి లాగ్ అవుట్ చేయకుండా ప్లాన్ చేస్తే ట్రాఫిక్ సమస్య తీరుతుందని భావించారు మొదటగా రెండు రోజులు మంగళ, బుధవారాలు అత్యంత భారీ వర్ష సూచన ఉండటంతో ఈ ప్లాన్ ని అమలు చేశారు. ప్లాన్ సక్సెస్ అయితే ఈ సీజన్ మొత్తానికి ఇదే కంటిన్యూ చేసే ఆలోచనలో సైబరాబాద్ పోలీసులు ఉన్నారు.
వర్షాల కారణంగా హైదరాబాద్ ట్రాఫిక్ జాం అవుతున్న నేపథ్యంలో మంగళవారం, బుధవారం ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు 3 దశలవారీగా లాగ్ అవుట్ చేసుకోవడానికి సూచించిన సైబరాబాద్ పోలీస్ శాఖ.
ఫేజ్ – 1
ఐకియా నుండి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి.
ఫేజ్ – 2
ఐకియా నుండి బయో డైవర్సిటి, రాయదుర్గం వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి.
ఫేజ్ – 3
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..