Hyderabad Drugs Case: వెలుగులోకి వస్తున్న పుడింగ్ అండ్ మింగ్ పబ్ ఆగడాలు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు

|

Apr 04, 2022 | 5:37 PM

Hyderabad Drugs Case: హైదరాబాద్‌లోని పుడింగ్ అండ్ మింగ్ పబ్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో కూడా బర్త్ డే పార్టీలకు డ్రగ్స్ సప్లై చేసినట్లు ఆధారాలు దొరికాయి.

Hyderabad Drugs Case: వెలుగులోకి వస్తున్న పుడింగ్ అండ్ మింగ్ పబ్ ఆగడాలు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు
Hyderabad Drugs Case
Follow us on

Hyderabad Pub Raid: హైదరాబాద్‌లోని పుడింగ్ అండ్ మింగ్ పబ్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో కూడా బర్త్ డే పార్టీలకు డ్రగ్స్ సప్లై చేసినట్లు ఆధారాలు దొరికాయి. పోలీసుల తనిఖీలు లేకపోవడంతో 24 గంటకు మద్యం సప్లై.. డ్రగ్స్ అందుబాటులో ఉంచి.. కస్టమర్లను ఆకర్షించినట్టు పోలీసులు గుర్తించారు. పబ్‌ నిర్వాహకుడు అభిషేక్‌, మేనేజర్‌ అనిల్‌లను సుదీర్ఘంగా విచారించిన పోలీసులు..వైద్య పరీక్షల అనంతరం అర్ధరాత్రి మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. ఇద్దరికీ 14 రోజుల రిమాండ్‌ విధించారు న్యాయమూర్తి. దీంతో వాళ్లిద్దర్ని తిరిగి బంజారాహిల్స్‌ పీఎస్‌కు తీసుకొచ్చారు. చంచల్‌గూడ జైలుకి తరలించనున్నారు.

పుడింగ్‌ & మింక్ డ్రగ్ పార్టీ కేసులో కొత్త ట్విస్ట్  చోటు చేసుకుంది.  ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో మరొకరిని నిందితులుగా చేర్చారు. మొత్తం నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. వాళ్లే అనిల్, అభిషేక్, కిరణ్ రాజ్, అర్జున్. నిన్నటి వరకు ముగ్గురినే నిందితులుగా గుర్తించారు. సోమవారంనాడు కొత్తగా కిరణ్ రాజ్ సీన్ లోకి వచ్చారు. పబ్‌కి లీగలైజర్‌గా కిరణ్ రాజ్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న అర్జున్ విరమచినేని, కిరణ్ రాజ్ కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన అనిల్, అభిషేక్‌ను మరికొద్ది సేపటిలో రిమాండ్‌కు తరలించనున్నారు.

మైనర్లకు మద్యం విక్రయం..

పుడింగ్ అండ్ మింక్ పబ్‌ ఆగడాలపై పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పబ్‌లో డ్రగ్స్ అమ్మడమే కాదు.. మైనర్లకు మద్యం అమ్మినట్టు తేలింది.పోలీసుల రెయిడ్‌లో దొరికిన వాళ్లలో ఆరుగురు మైనర్లు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు.

పబ్‌లో హైటెక్ టెక్నాలజీ..

పబ్ మెయింటెనెన్స్‌లో హైటెక్ టెక్నాలజీ ఉపయోగించారు. పబ్‌లోకి ఎవరికి పడితే వాళ్లకు ఎంట్రీ ఉండదు. లక్ష రూపాయల డిపాజిట్‌ చేస్తేనే యాప్‌ యాక్సిస్‌కు పర్మిషన్ ఉంటుంది. యాప్‌లో వచ్చిన ఐడీ చూపిస్తేనే పబ్‌లోకి ఎంట్రీ ఇస్తారు. పామ్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని OTP వచ్చిన వారికి మాత్రమే పబ్‌లో అనుమతి ఉంటుంది. డ్రగ్స్ కోసం మరో యాప్ తో పాటు వాట్సప్ గ్రూప్ పెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.

డ్రగ్స్ వ్యవహారం మొత్తం.. పబ్ మేనేజర్ అనిల్ కుమార్ కనుసన్నుల్లో నడుస్తున్నట్లు గుర్తించారు. ఫోన్‌కు వచ్చిన OTP లు నిర్ధారించుకున్న తరువాతే డ్రగ్స్‌ సప్లై చేస్తారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేయగా.. అర్జున్ పరారీలో ఉన్నారు. అతని కోసం రెండు ప్రత్యేక టీమ్‌లు గాలిస్తున్నాయి.

మరోవైపు రాడిసన్ బ్లూ పబ్ సిబ్బందిని రాత్రంతా విచారించారు. పబ్‌లో ఏమేం జరుగుతుంది? ఎవరెవరు వస్తున్నారు? డ్రగ్ వినియోగం జరుగుతుందా? సెలబ్రిటీలు, ప్రముఖులు ఎవరెవరు వస్తారనే కోణంలో ఆరాతీశారు. అర్ధరాత్రి తర్వాత వాళ్లందర్నీ విచారించి వదిలేశారు.

కస్టమర్ల వివరాల సేకరణ.. 

హైదరాబాద్ పుడింగ్‌ పబ్‌ కూపీలాగుతున్నారు పోలీసులు. డగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారని ఆరా తీస్తున్నారు. 148 మంది కస్టమర్ల పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న వెస్ట్ జోన్ డీసీపీ.. జాబితాలో ఉన్నవారిపై నిఘా పెడతామన్నారు. పబ్‌ మేనేజర్‌ అనిల్‌ దగ్గర ఐదు ప్యాకెట్ల కొకైన్‌ లభించిందన్న వెస్ట్ జోన్ డీసీపీ.. రైడ్‌ చేసిన సమయంలో అందులో 148 మంది ఉన్నారని స్పష్టం చేశారు. అభిషేక్‌, అనిల్‌ను అరెస్ట్ చేశామన్న డీసీపీ.. అర్జున్‌ వీరమాచినేని పరారీలో ఉన్నాడని వివరించారు.

పబ్‌ కేసులో పేర్లు బయటపడిన వారు గగ్గోలు పెడుతున్నారు. తమ కొడుకు అభిషేక్‌ నిరపరాధి అంటోంది ఉప్పల శారద. అసత్య ప్రచారాలు చేయొద్దంటూ వేడుకుంటోంది. అభిషేక్‌ పబ్‌ ఓనర్‌ కాదు.. పార్ట్‌నర్‌ మాత్రమే అంటున్న శారద.. కస్టమర్లు తెచ్చుకున్న డ్రగ్స్‌తో తన కొడుకుకు ఏం సంబంధమని ప్రశ్నిస్తోంది.

నిహారిక పేరు బయటకు రావడంతో నాగబాబు స్పందించారు. నిర్ణీత సమయానికి మించి పబ్‌ నడుపుతున్నారని పోలీసులు యాక్షన్‌ తీసుకున్నారన్న నాగబాబు.. తన కూతురు నిహారిక విషయంలో అంతా క్లియర్‌గా ఉందన్నారు. ఈ వ్యవహారంలో తప్పుడు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

పుడింగ్ పబ్‌లో రాహుల్ సిప్లిగంజ్ బర్త్ డే పార్టీకి వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే తాను ఎలాంటి పరీక్షలకైనా సిద్దమంటున్నారు సింగర్ రాహుల్ సిప్లిగంజ.

Also Read..

SIP ద్వారా మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి.. తక్కువ మొత్తంతో ఎక్కువ సంపాదించండి..!

RRR Movie: ఆలిండియా రికార్డ్‌ బద్దులకొట్టిన ఆర్ఆర్ఆర్.. ఆ విషయంలో నంబర్ వన్ సినిమాగా..