RRR Movie: ఆలిండియా రికార్డ్‌ బద్దలుకొట్టిన ఆర్ఆర్ఆర్.. ఆ విషయంలో నంబర్ వన్ సినిమాగా..

ఆర్ఆర్ఆర్ (RRR).. బాక్సాఫీస్‏ను షేక్ చేస్తుంది. మార్చి 25న విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది.

RRR Movie:  ఆలిండియా రికార్డ్‌ బద్దలుకొట్టిన ఆర్ఆర్ఆర్.. ఆ విషయంలో నంబర్ వన్ సినిమాగా..
Rrr
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 04, 2022 | 6:23 PM

ఆర్ఆర్ఆర్ (RRR).. బాక్సాఫీస్‏ను షేక్ చేస్తుంది. మార్చి 25న విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. జక్కన్న తెరకెక్కించిన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు ఇప్పటికీ క్యూ కడుతున్నారు. సినిమా విడుదలై రెండు వారాలు గడుస్తున్న ఆర్ఆర్ఆర్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకీ ఆర్ఆర్ఆర్ ప్రభంజనం మరింత పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. విడుదలైన అన్ని భాషలలో ఆర్ఆర్ఆర్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అల్లూరి సీతారామరాజుగా చరణ్.. గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో తారక్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వీరిద్దరి స్నేహాబంధాన్ని చూసేందుకు థియేటర్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లు వసూళ్లు చేసిన ఈసినిమా.. తాజాగా ఆలిండియా రికార్డ్ బద్దలుకొట్టింది.

ఇప్పటికే కలెక్షన్లో నోటబుల్ రికార్డ్స్‌ క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న ట్రిపుల్ ఆర్… తాజాగా మరో రికార్డు క్రియేట్ చేసింది. ఈ సారి మరే సినిమా సెట్‌ చేయలేని మార్క్‌ను సెట్ చేసి.,.. ఆలిండియా నెంబర్‌ సినిమాగా నిలిచింది. ఇక సినిమా రిలీజ్‌కు ముందు నుంచి ఆన్‌లైన్ టికెటింగ్ యాప్‌ బుక్‌ మై షో సినిమా రేటింగ్‌ను రికార్డ్‌ చేస్తూ ఉంటుంది. ఎట్ ఈ రేంటింగ్‌లోనే ట్రిపుల్ ఆర్ ఆలిండియా రికార్డును సెట్ చేసింది. దాదాపు 571Kకి పైగా రేటింగ్ సాధించి అందర్నీ షాక్ చేస్తోంది ఈ సినిమా.. అంతేకాదు ఇప్పటి వరకు రిలీజైన అన్ని సినిమాలతో పోల్చితే 90 శాతం పాజిటివ్ రేటింగ్ ఒక్క ట్రిపుల్ ఆర్ సినిమాకే వచ్చింది. దీంతో ఈ ఫీట్ రేరెస్ట్ ఆఫ్‌ది రేర్‌ అంటున్నారు మూవీ మేకర్స్.

Also Read: Anchor Anasuya: మరోసారి నెటిజన్‏కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన అనసూయ.. ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారంటూ..

Varalaxmi Sarathkumar: టాలీవుడ్‏పై వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంట్రెస్ట్.. కొత్త ప్రాజెక్ట్ షూరు చేసిన జయమ్మ..

Sonam Kapoor: వెరైటీ చీరకట్టులో బేబి బంప్‏తో ఫోటో షూట్.. నెట్టింట్లో షేర్ చేసిన హీరోయిన్..

Nithin: మరో సినిమాను పట్టాలెక్కించిన నితిన్‌.. ‘పెళ్లి సందD’ ముద్దుగుమ్మ జంటగా..