Hyderabad: ఇన్వెస్ట్‌మెంట్ పెడితే డబుల్ అన్నారు.. కట్ చేస్తే.. దేశవ్యాప్తంగా రూ.717 కోట్లు లూటీ చేశారు.. చివరకు..

Cyber Fraud Case: దేశంలో రోజు రోజుకి సైబర్ క్రైమ్ మోసాలు పెరిగిపోతున్నాయి.. ఎట్టి పరిస్థితుల్లోనూ సైబర్ క్రైమ్ నిందితులని నమ్మొద్దు అంటూ పదేపదే పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ పబ్లిక్ మాత్రం అదేపదిగా మోసపోతూనే ఉన్నారు..

Hyderabad: ఇన్వెస్ట్‌మెంట్ పెడితే డబుల్ అన్నారు.. కట్ చేస్తే.. దేశవ్యాప్తంగా రూ.717 కోట్లు లూటీ చేశారు.. చివరకు..
Cyber Fraud Case

Edited By:

Updated on: Jul 22, 2023 | 9:48 AM

Cyber Fraud Case: దేశంలో రోజు రోజుకి సైబర్ క్రైమ్ మోసాలు పెరిగిపోతున్నాయి.. ఎట్టి పరిస్థితుల్లోనూ సైబర్ క్రైమ్ నిందితులని నమ్మొద్దు అంటూ పదేపదే పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ పబ్లిక్ మాత్రం అదేపదిగా మోసపోతూనే ఉన్నారు.. తాజాగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ పేరిట పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రూ.717 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన ముఠా హైదరాబాద్ పోలీసులకు చిక్కింది. హైదరాబాద్, కోల్‌కతా కేంద్రంగా చాలామందిని అమాయకులను పెట్టుబడిల కోసం మోసం చేసినటువంటి మూఠాను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు.. ముంబై, లక్నో, గుజరాత్ హైదరాబాద్ కు చెందిన చాలామంది ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నారు. పెట్టుబడుల పేరుతో భారీ స్కాం కి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.. వీళ్ళ వ్యవహారమంతా చైనా దుబాయిలో ఉన్న కంపెనీలతో ఉన్నట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడింది..

ఇన్వెస్ట్‌మెంట్ పెట్టండి పెద్ద ఎత్తున రాబడి వస్తుందంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న 9 మందిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. మొత్తంగా ఈ నిందితులు రూ.కోట్లు దండుకున్నట్లు పేర్కొంటున్నారు. విచారణ జరుగుతోందని.. త్వరలోనే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

ఇన్వెస్ట్మెంట్ తెలిసి తెలియని వ్యక్తుల దగ్గర డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దు అంటూ పెద్ద ఎత్తున పోలీసులు చెప్తున్నప్పటికీ.. ప్రజలు మాత్రం వినకుండా మోసపోతున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా 712 కోట్ల మోసానికి పాల్పడ్డ హైదరాబాద్ పోలీసులకు చిక్కిందంటే దీంట్లో ఇంకా ఎంతమంది సామాన్య ప్రజలు డబ్బులు పోతున్నారు అర్థం చేసుకోవచ్చు..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..