Hyderabad Police: హైదరాబాద్ పోలీసులు రాక్స్.. దొంగలు షాక్.. ఇది కదా ప్రజలకు కావాల్సిన స్పీడ్
హైదరాబాద్ నేర చరితులను పట్టుకునే విషయంలో తమ స్మార్ట్‌నెస్ మరోసారి నిరూపించారు. దొంగలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. పని పూర్తిచేసుకుని బస్సులో సొంతూరికి బయలుదేరిన దొంగలను
Hyderabad Police: హైదరాబాద్ నేర చరితులను పట్టుకునే విషయంలో తమ స్మార్ట్‌నెస్ మరోసారి నిరూపించారు. దొంగలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. పని పూర్తిచేసుకుని బస్సులో సొంతూరికి బయలుదేరిన దొంగలను పట్టుకోవడానికి ఏకంగా విమానంలో వెళ్లారు. వారి కంటే ముందుగానే వెళ్లి.. బస్సు దిగగానే చేతులకు బేడీలు వేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న ఒక బేకరీలో కొద్ది రోజుల క్రితం దొంగతనం జరిగింది. అందులో ఉన్న దాదాపు రూ.5 లక్షల నగదు దుండగులు తస్కరించారు. దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు బేకరి ఓనర్. దీంతో వెంటనే నాలుగు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. తొలుత సీసీటీవీ విజువల్స్ ద్వారా దొంగలను పోలీసులు గుర్తించారు. వాచ్‌మేన్ దొంగతనానికి పాల్పడినట్లుగా నిర్థారించారు. అయితే, అప్పటికే చోరీ చేసిన దొంగలు సొంతూరికి పయనమైనట్లు తెలుసుకున్నారు. దొంగలను ఎలాగైనా సరే పశ్చిమబెంగాల్‌లో వాళ్ల స్వగ్రామానికి వెళ్లలోగా పట్టుకోవాలని పోలీసులు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు.
ఇందులో భాగంగా సాయంత్రం మూడు గంటల సమయంలో కోల్‌కతా వెళ్లే ఫ్లైట్ ఎక్కారు. దొంగలు సరిగ్గా 8 గంటల సమయంలో బస్సు దిగారు. అంతకుముందే అక్కడికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు యాక్షన్ ప్లాన్ ఇది:
ఎంజీబీఎస్ నుంచి కోల్‌కతాకి బస్సులో ముగ్గురు దొంగలు పయనమయ్యారు. సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేశారు. అయితే చివరి సారిగా బస్సులో ఎక్కడానికి ముందు దొంగలు మాట్లాడిన ఫోన్ కాల్ పోలీసులకు హింట్ ఇచ్చింది. దొంగలు నేరుగా బస్సులో కోల్‌కతాకి వెళ్తున్నట్టుగా పోలీసులు కనుగొన్నారు. వీరికంటే ముందే కోల్‌కతా చేరుకున్న పోలీసులు అక్కడ టాక్సీ తీసుకొని బస్సు వచ్చే రూట్లో దానికి ఎదురుగా వెళ్లారు. దాదాపు 150 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత నిందితులు ఉన్న బస్ దొరికింది. అక్కడే వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసులను అక్కడ చూసి దొంగలు షాకయ్యారు.
Also Read:
ఓటీటీ ఎపిసోడ్ల మాదిరిగా పోర్న్ కంటెంట్.. వారానికో ఎపిసోడ్ రిలీజ్.. విచారణలో దిమ్మతిరిగే విషయాలు
నల్లగా ఉన్నావ్.. వదిలేసి.. మరొకర్ని పెళ్లి చేసుకుంటానన్న భర్త.. భార్య ఊహించని పని చేసింది
చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా ఆమె మరణం అంతుచిక్కని మిస్టరీనే.. దెయ్యమే చంపిందా..?.. షాకింగ్ వీడియో