టమాటాతో క్యాన్సర్‎కి బై.! గుండెకు హాయి.!

04 December 2024

TV9 Telugu

టమాటాలు కూరకు రుచిని ఇవ్వడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. విటమిన్ సీ, పొటాషియం, ఫోలేట్, విటమిన్-కే పుష్కలంగా లభిస్తాయి.

టమాటాలలో కేలరీలు తక్కువగా ఉండి, నీటి పదార్థం ఎక్కువగా ఉండడంతో శరీరానికి చక్కటి డైట్ ఫుడ్‌గా పనిచేస్తుంది.

టమాటాలలోని ఫైబర్ కంటెంట్ ఎక్కువసేపు ఆకలి కానివ్వదు. అనారోగ్యకరమైన చిరుతిండిని తినాల్సిన అవసరం ఉండదు.

రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. టమాటాలలో పుష్కలంగా ఉంటే విటమిన్ ఏ, సీ కలయిక చర్మానికి మేలు చేస్తాయి.

లైకోపీన్, పొటాషియం, విటమిన్ సీ.. బీపీని కంట్రోల్ చేయడంలో, ధమనుల పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి.

దీనిలో కీలకమైన ‘లైకోపీన్’కు కొన్ని క్యాన్సర్ల ముప్పును తగ్గించే లక్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు తగ్గించేలా ప్రభావవంతంగా పనిచేస్తోంది.

చర్మాన్ని సంరక్షించడంలో టమాటాలు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. ఆహారంలో భాగంగా తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

‘ఫ్రీ రాడికల్స్‌’ను న్యూట్రల్ చేయడం ద్వారా కణాల ఆరోగ్యానికి మంచి ఆరోగ్య ప్రయోజనకారిగా టమాటా దోహదపడుతుంది.