Hyderabad: నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్‌ వేడుకలకు హాజరుకానున్న సీఎం రేవంత్‌

|

Dec 22, 2023 | 7:40 AM

కిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం (డిసెంబర్‌ 22) విందు ఏర్పాటు చేసింది. ఈ క్రార్యక్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఏఆర్‌ పెట్రోల్‌బంక్‌ (పబ్లిక్ గార్డెన్స్) కూడలినుంచి బషీర్‌బాగ్‌ బీజేఆర్‌ విగ్రహం కూడలి వైపు ట్రాఫిక్‌ను..

Hyderabad: నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్‌ వేడుకలకు హాజరుకానున్న సీఎం రేవంత్‌
Traffic Restrictions
Follow us on

హైదరాబాద్‌, డిసెంబర్‌ 22: కిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం (డిసెంబర్‌ 22) విందు ఏర్పాటు చేసింది. ఈ క్రార్యక్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఏఆర్‌ పెట్రోల్‌బంక్‌ (పబ్లిక్ గార్డెన్స్) కూడలినుంచి బషీర్‌బాగ్‌ బీజేఆర్‌ విగ్రహం కూడలి వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ వాహనాలను నాంపల్లి లేదా రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు. అబిడ్స్‌, గన్‌ఫౌండ్రిల వైపునుంచి వచ్చే ట్రాఫిక్‌ను బషీర్‌బాగ్‌ బీజేఆర్‌ విగ్రహం కూడలి వైపు అనుమతించరు. ఇటుగా వచ్చే ట్రాఫిక్‌ను గన్‌ఫౌండ్రిలోని ఎస్‌బీఐ నుంచి సుజాతస్కూల్‌ మీదుగా చాపెల్‌ రోడ్డు వైపు మళ్లిస్తారు. ట్యాంక్‌బండ్‌ నుంచి బషీర్‌బాగ్‌ జంక్షన్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను లిబర్టీ జంక్షన్‌ నుంచి హిమాయత్‌నగర్‌ వైపు (అవసరం బట్టి) పంపిస్తారు.

వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పైన పేర్కొన్న సమయాల్లో సూచించిన మార్గాల్లో ప్రయాణించాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. అలాగే ఈ రోజు రాష్ట్రపతి నిలయం వద్ద కూడా ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి. సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ మళ్లింపులుంటాయని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు జంక్షన్లలో శుక్రవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి.

లోతుకుంట టీ.జంక్షన్‌, ఎంసీఈఎంఈ సిగ్నల్‌, లాల్‌బజార్‌ టి.జంక్షన్‌, తిరుమలగిరి ఎక్స్‌రోడ్స్‌, సికింద్రాబాద్‌ క్లబ్‌ఇన్‌ గేట్‌, టివోలి కూడలి, ప్లాజా ఎక్స్‌ రోడ్స్‌, సీటీఓ, ఎస్‌బీఐజంక్షన్‌, రసూల్‌పుర, పీఎన్‌టీ పైవంతెన, గ్రీన్‌ల్యాండ్‌, మోనప్ప కూడలి, ఖైరతాబాద్‌ వీవీ విగ్రహం జంక్షన్‌ వద్ద, పంజాగుట్ట, ఎన్‌ఎఫ్‌సీఎల్‌, ఎన్టీఆర్‌ భవన్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్టుల వద్ద ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. ఇటుగా వచ్చే వాహనాలను అవసరాన్ని బట్టి మళ్లింపులు ఉంటాయని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.