AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మరో వివాదంలో ‘పుల్లారెడ్డి’ ఫ్యామిలీ.. తప్పుడు పత్రాలతో కోట్ల విలువైన ఫ్లాట్‌ కబ్జా.. కేసు నమోదు

పుల్లారెడ్డి స్వీట్స్‌ ఫ్యామిలీపై కబ్జా కేసు నమోదైంది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కోట్ల రూపాయల విలువైన ప్లాట్‌ కబ్జాకు ప్రయత్నించారు పుల్లారెడ్డి కుమారుడు రాఘవరెడ్డి. ఫేక్‌ ఆధార్‌ కార్డు, తప్పుడు పత్రాలతో ప్లాట్‌ను కొట్టేసేందుకు యత్నించారు.

Hyderabad: మరో వివాదంలో 'పుల్లారెడ్డి' ఫ్యామిలీ.. తప్పుడు పత్రాలతో కోట్ల విలువైన ఫ్లాట్‌ కబ్జా.. కేసు నమోదు
Pulla Reddy Family
Basha Shek
|

Updated on: Feb 05, 2023 | 6:58 PM

Share

పుల్లారెడ్డి స్వీట్స్‌ ఫ్యామిలీపై కబ్జా కేసు నమోదైంది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కోట్ల రూపాయల విలువైన ప్లాట్‌ కబ్జాకు ప్రయత్నించారు పుల్లారెడ్డి కుమారుడు రాఘవరెడ్డి. ఫేక్‌ ఆధార్‌ కార్డు, తప్పుడు పత్రాలతో ప్లాట్‌ను కొట్టేసేందుకు యత్నించారు. బాధితుల ఫిర్యాదుతో పుల్లారెడ్డి కుమారుడు రాఘవరెడ్డి, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్‌ పోలీసులు. ప్రేమ్‌కుమారి పేరుతో ఫేక్‌ ఆధార్‌ను సృష్టించారు పుల్లారెడ్డి కుటుంబ సభ్యులు. ప్రేమ్‌కుమారి పేరుతో ఆధార్‌ కార్డుకు అప్లై చేశారు. అయితే, ప్రేమ్‌కుమారి చనిపోయిన ఐదేళ్లకు ఆధార్‌ కార్డ్‌ డెలివరీ కావడం, ఆధార్‌ కార్డుపై ముస్లిం యువతి ఫొటో ఉండటంతో ఆధార్‌ అధికారులకు, పోలీసులకు కంప్లైంట్‌ చేశారు ఫ్యామిలీ మెంబర్స్‌. దాంతో పుల్లారెడ్డి రాఘవరెడ్డి కబ్జా బాగోతం మొత్తం బయటపడింది. రాఘవురెడ్డి భార్య భారతీరెడ్డి పేరుతో ప్రాపర్టీని కొనుగోలు చేసినట్టు తప్పుడు పత్రాలు సృష్టించడమే కాకుండా.. న్యాయవాది శ్రీనాథ్‌ పేరిట ఇంగ్లిష్‌ పేపర్‌లో ప్రకటన కూడా ఇచ్చారు. అయితే, పోలీసుల దర్యాప్తులో అసలు శ్రీనాథ్‌ లాయరే లేనట్టు తేలింది.

కాగా.. గతేడాది పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని రాఘవరెడ్డి కుటుంబానికి చెందిన వరకట్న వేధింపుల వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తనకు న్యాయం చేయాలంటూ రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. రాఘవరెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డి, వారి కుమార్తె శ్రీవిద్యారెడ్డిల నుంచి తనను కాపాడాలంటూ ప్రజ్ఞారెడ్డి లేఖలో కోరారు

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!