Holi 2021: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హోలీ వేళ వైన్ షాపులు బంద్.. ఎన్ని రోజులంటే..

Holi 2021: హోలీ పండుగ వస్తున్న వేళ మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. హోలీ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్

Holi 2021: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హోలీ వేళ వైన్ షాపులు బంద్.. ఎన్ని రోజులంటే..
Liquor Shops

Updated on: Mar 25, 2021 | 7:07 PM

Holi 2021: హోలీ పండుగ వస్తున్న వేళ మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. హోలీ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ పాటించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. హోలీ పండగ రోజు నుంచి అంటే మార్చి 28వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 30 ఉదయం 6 గంటల వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా.. ఇతరులకు అసౌకర్యం కలిగించడం.. రోడ్లపై రంగులు చల్లుకోవడం, గుంపులుగా వాహనాలపై తిరగడం వంటి చర్యలను నిషేదిస్తూ.. మరో ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నియమాలను ఎవరైనా అతిక్రమిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు.

గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే హోలీ సంబరాలను ప్రతి ఒక్కరు ప్రశాంతంగా జరుపుకోవాలని.. కరోనా నిబంధనలు దృష్టిలో పెట్టుకోని వేడుకలు జరుపుకోవాలి తెలిపారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండగా.. అందులో మరీ ఎక్కువ కేసులు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోనే నమోదవుతుండడం కొంత ఆందోనలకు గురిచేస్తుంది. ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని.. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలని మంత్రి ఈటెల రాజెందర్ ఇప్పటికే ప్రకటించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్కూల్స్‏ను తిరిగి మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు మళ్లీ ఆన్‏లైన్‏లో క్లాసులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లు మూసివేయడం లేదని.. కేవలం కరోనా నిబంధనలు జాగ్రత్తగా పాటించాలని తెలిపింది.

Also Read:

హోలీ వచ్చేస్తుంది.. ఎలాంటి డ్రెస్సులు ధరించాలని ఆలోచిస్తున్నారా ? అయితే మీకోసమే ఈ ఐడియాస్..

Holi Festival: హోలీ పండుగ కోసం సిద్ధమవుతున్నారా ? నిపుణుల సూచనలు బ్యూటీ టిప్స్ ఇవే..