Hyderabad: అర్థరాత్రి హోం మంత్రికి ఫోన్‌ చేసిన పాతబస్తీ యువకులు.. ఉన్నత స్థాయి సమావేశానికి ఆదేశించిన..

| Edited By: Narender Vaitla

Aug 21, 2023 | 4:26 PM

హత్య జరుగుతున్న వాటిల్లో ఎక్కువగా రౌడీషీటర్ల పాత్ర ఉంటోంది. గతంలో రౌడీషీటర్లపై పోలీసులు నిరంతరం నిఘా పెట్టేవారు, వారి రోజు వారీ కార్యకలాపాలను పరిశీలించేవారు. వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్‌కు పలిపించి కౌన్సెలింగ్ ఇచ్చే వారు, వినకుండా ప్రవర్తించే వారిపై పిడి యాక్ట్ పెట్టి జైలుకు పంపించేవారు. కాని గత కొంత కాలం నుంచి నగర పోలీసులు రౌడీషీటర్లపై నిఘా తగ్గించడంతో మళ్లీ రెచ్చిపోతున్నారు. తిరిగి నేరాలు పాల్పడుతున్నారు. గతంలో తమతో గొడవలు...

Hyderabad: అర్థరాత్రి హోం మంత్రికి ఫోన్‌ చేసిన పాతబస్తీ యువకులు.. ఉన్నత స్థాయి సమావేశానికి ఆదేశించిన..
Hyderabad Old City
Follow us on

ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌ పాత బస్తీలో నేరాలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వరుస హత్యలు ఓల్డ్‌ సిటీని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. చిన్నచిన్న తగాదాలకు నిందితులు హత్యలు చేస్తున్నారు, ముఖ్యంగా పాతబస్తీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. చాలా హత్యల విషయంలో పాతకక్షలను మనసులో పెట్టుకుని హత్యలు చేస్తున్నారు.

హత్య జరుగుతున్న వాటిల్లో ఎక్కువగా రౌడీషీటర్ల పాత్ర ఉంటోంది. గతంలో రౌడీషీటర్లపై పోలీసులు నిరంతరం నిఘా పెట్టేవారు, వారి రోజు వారీ కార్యకలాపాలను పరిశీలించేవారు. వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్‌కు పలిపించి కౌన్సెలింగ్ ఇచ్చే వారు, వినకుండా ప్రవర్తించే వారిపై పిడి యాక్ట్ పెట్టి జైలుకు పంపించేవారు. కాని గత కొంత కాలం నుంచి నగర పోలీసులు రౌడీషీటర్లపై నిఘా తగ్గించడంతో మళ్లీ రెచ్చిపోతున్నారు. తిరిగి నేరాలు పాల్పడుతున్నారు. గతంలో తమతో గొడవలు పెట్టుకున్న వారిని టార్గెట్‌గా చేసుకుని హత్యలు చేస్తున్నారు. దీంతో పాత బస్తీలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

ఇదిలా ఉంటా తాజాగా పాత బస్తీ యువకులు ఈ విషయంపై ఏకంగా హోం మంత్రి మహమూద్ అలీకి ఫిర్యాదు చేశారు. పాత బస్తీలో వరుసగా జరుగుతోన్న సంఘటనలపై హోమంత్రికి నేరుగా ఫిర్యాదు చేశారు పాతబస్తీ యువకులు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్థరాత్రి దాటిన తర్వాత హోంమంత్రికి ఫోన్ చేసి హత్యపై ఫిర్యాదు చేయడం గమనార్హం. వరుస ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుండటంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. హత్యలపై హోంమంత్రి దృష్టి సారించారు.

ఇవి కూడా చదవండి

హంతకుల ఆట కట్టించేందుకు సిద్ధమయ్యారు. త్వరలో పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. మంగళవారం పాత బస్తీలో జరుగుతోన్న నేరాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు హోం మంత్రి తెలిపారు. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లల గొడవపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని సూచించారు. మరోవైపు దక్షిణ మండలం డిసిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో పాతబస్తీ భవాని నగర్ లోని ఇరుకైన గల్లీలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వాహనాలు, చిన్న చిన్న దుకాణాలను తనిఖీలు చేశారు. ఇక గంజాయి బ్యాచ్ ఆగడాలపై దృష్టి సారించారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..