Hyderabad: నగరవాసులకు అలెర్ట్‌.. ఆ రెండు రోజుల్లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం..

|

Feb 20, 2022 | 4:52 PM

తాగునీటి సరఫరాకు సంబంధించి నగర వాసులకు హైదరాబాద్ (Hyderabad) జల మండలి కీలక సూచనలు చేసింది.

Hyderabad: నగరవాసులకు అలెర్ట్‌.. ఆ రెండు రోజుల్లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం..
Hyderabad Water Supply
Follow us on

తాగునీటి సరఫరాకు సంబంధించి నగర వాసులకు హైదరాబాద్ జల మండలి కీలక సూచనలు చేసింది. హైదరాబాద్ (Hyderabad) మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ (కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్ -3కి సంబంధించిన 2375 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ హెడర్ పైప్‌కు జలమండలి మరమ్మతులు చేపట్టనుంది. అలాగే, కోదండాపూర్ పంపింగ్ స్టేషన్ పంప్ హౌజ్ వద్ద మరమ్మతు పనులను నిర్వహిస్తోంది. బుధవారం (ఫిబ్రవరి23) ఉదయం 5 గంటల నుంచి మరుసటి రోజు అనగా గురువారం (ఫిబ్రవరి 24) సాయంత్రం 5 గంటల వరకు సుమారు 36 గంటల పాటు ఈ మరమ్మతు పనులు కొనసాగుతాయి. ఈనేపథ్యంలో ఈ 36 గంటల పాటు కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ – 3 కింద ఉన్న రిజర్వాయర్ల ప‌రిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు జలమండలి ఓ ప్రకటన విడుదల చేసింది.

నీటి సరఫరాలో అంతరాయం ఉండే ప్రాంతాలు:
1. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 1 – శాస్త్రీపురం
2. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 2 – బండ్లగూడ
3. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 3 – భోజగుట్ట, చింతల్‌బ‌స్తీ, షేక్‌పేట్
4. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 4 – అల్లబండ
5. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 6 – జూబ్లీహిల్స్, ఫిల్మ్ న‌గర్, ప్రశాసన్‌నగ‌ర్‌, తట్టిఖానా
6. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 7 – లాలాపేట(కొంత భాగం)
7. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 10 – సాహేబ్‌న‌గ‌ర్‌, ఆటోనగర్, సరూర్‌న‌గర్, వాసవి రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు
8. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 13 – సైనిక్‌పురి, మౌలాలి
9. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 14 – స్నేహపురి, కైలాస్‌గిరి, దేవేంద్రనగర్
10. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 15 – గచ్చిబౌలి, మాధాపూర్, అయ్యప్ప సొసైటీ, కావురి హిల్స్
11. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 16 – మధుబన్, దుర్గానగర్, బుద్వేల్, సులేమానగర్, గోల్డెన్ హైట్స్, 9 నెంబర్
12. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 18 – కిస్మత్‌పూర్, గంధంగూడ
13. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 19 – బోడుప్పల్, మల్లిఖార్జుననగర్, మాణిక్‌చంద్, చెంగిచర్ల, భరత్‌న‌గర్, పీర్జాదిగూడ
14. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 20 – ధర్మసాయి

కావున నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు సూచించారు.

Also Read:Constable Suicide: హైదరాబాద్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. కారణమేంటంటే..

IRCTC Coorg Tour: కూర్గ్‌ అందాలను చూడాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీ.. పూర్తి వివరాలివే..

Viral Video: టీచర్‌ బదిలీతో విద్యార్థుల కన్నీరు మున్నీరు.. వినూత్నంగా వీడ్కోలు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..