నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. మెట్రో ట్రేడింగ్‌ బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో భారీగా మంటలు

Nampally fire Accident: హైదరాబాద్‌లోని నాంపల్లి స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రో ట్రేడింగ్‌ బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో శనివారం అర్ధరాత్రి భారీగా మంటలు..

  • Subhash Goud
  • Publish Date - 12:42 am, Sun, 18 April 21
నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. మెట్రో ట్రేడింగ్‌ బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో భారీగా మంటలు
Fire Accident

Nampally fire Accident: హైదరాబాద్‌లోని నాంపల్లి స్టేషన్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రో ట్రేడింగ్‌ బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో శనివారం అర్ధరాత్రి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న దూది గోదాంలోకి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రెండు ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుస్తున్నారు. అయితే షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, ముందే వేసవి కాలం.. పైగా అగ్ని ప్రమాదాలు చాలా సంభవిస్తుంటాయి. సిబ్బంది నిర్లక్ష్యం, షార్ట్‌ సర్క్యూట్‌ తదితర కారణాల వల్ల ఎన్నో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. హైదరాబాద్‌ నగరంలో చాలా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. ప్రమాదశాత్తు సంభవించే ఈ ప్రమాదాల్లో ప్రాణ నష్టం పెద్దగా లేకపోయినా.. ఆస్తినష్టం మాత్రం కోట్లాల్లో ఉంటుంది.

ఇవీ కూడ  చదవండి: Covid-19 Hospital: కరోనా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం… నలుగురు కరోనా రోగులు సజీవదహనం

ఏపీ మాజీ మంత్రి మహమ్మద్‌ జానీ కన్నుమూత… రెండు సార్లు ఎమ్మెల్యేగా, శాసన మండలిలో డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు