AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister KTR: మున్సిపల్ సిబ్బందికి సెలవులు రద్దు.. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం

రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసింది.

Minister KTR: మున్సిపల్ సిబ్బందికి సెలవులు రద్దు.. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం
KTR
Balaraju Goud
|

Updated on: Apr 17, 2021 | 9:21 PM

Share

Cancellation of leave for Municipal Employees: రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో యుద్ధ ప్రాతిపదికన క్రిమిసంహారక ద్రావకం సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, కమిషనర్ ఎండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌లతో మంత్రి కేటీఆర్ టెలి కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు.

ప్రస్తుతం మున్సిపల్ శాఖ వద్ద ఉన్న వాహనాలతో పాటు అవసరమైన చోట ప్రత్యేకంగా వాహనాలను అద్దెకు తీసుకుని సోడియం హైపోక్లోరేట్ ద్రావకం పిచికారీ చేయాలని మంత్రి చెప్పారు. ఇందుకోసం పట్టణ ప్రగతి నిధులు వినియోగించాలని మంత్రి సూచించారు. కరోనా తీవ్రత కొనసాగుతున్నందున శాఖ పరిధిలో ఉన్న ఎంటమాలజిస్టులు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మున్సిపల్ శాఖ పరిధిలోని ఉద్యోగులు అందరు విధులకు హాజరు కావాలని, సెలవులు రద్దు చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించినట్లు సమాచారం. దీంతో పాటు కోవిడ్ నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలని మంత్రి కేటీఆర్ అధికారులను కోరారు.

మున్సిపల్ శాఖ సిబ్బంది కరోనాపై పోరులో ముందువరుసలో ఉన్నందున శాఖ ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ చేయించాలని మంత్రి ఉన్నతాధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు రేపటికల్లా వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి అవుతుందని, మిగతా పురపాలికల్లో కూడా ఇంకో రెండు లేదా మూడు రోజుల్లో ఉద్యోగులు అందరికీ వ్యాక్సినేషన్ చేయిస్తామని అధికారులు మంత్రి ఆదేశించారు.

Read Also… AP Corona Vaccine: ఏపీకి చేరిన కరోనా వ్యాక్సిన్.. ప్రత్యేక వాహనాల్లో భారీ బందోబస్తు నడుమ జిల్లాలకు టీకాల తరలింపు

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..