హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వినూత్న ఆలోచన… డ్రైవ్‌ చేసుకుంటూ ఇంటికెళ్లేందుకు లగ్జరీ కార్లు ఏర్పాటు

Hyderabad Airport: హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) వినూత్న ఆలోచన చేసింది. విమానాశ్రయంలో దిగగానే ఒక్క క్లిక్‌తో లగ్జరీ కారు డ్రైవ్‌.

  • Subhash Goud
  • Publish Date - 8:20 am, Sun, 18 April 21
హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వినూత్న ఆలోచన... డ్రైవ్‌ చేసుకుంటూ ఇంటికెళ్లేందుకు లగ్జరీ కార్లు ఏర్పాటు
Hyderabad Airport

Hyderabad Airport: హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) వినూత్న ఆలోచన చేసింది. విమానాశ్రయంలో దిగగానే ఒక్క క్లిక్‌తో లగ్జరీ కారు డ్రైవ్‌ చేసుకుంటూ ఇంటికి వెళ్లే అవకాశాన్ని కల్పిస్తోంది. దేశంలోనే తొలిసారిగా ఓ సరికొత్త ఆలోనకు అంతర్జాతీయ విమానాశ్రయం శ్రీకారం చుట్టింది. విమానాశ్రయంలో విమానం దిగగానే అత్యాధునిక, ఖరీదైన కార్లను అద్దెకు ఇస్తున్నట్లు జీఎంఆర్‌ ఇంటర్నేషనల్‌ ప్రకటించింది. విమానాశ్రయం అరైవల్స్‌ వద్ద ఉన్న 4వీల్‌ సంస్థ లగ్జరీ కార్లను అద్దెకు అందిస్తున్నట్లు జీఎంఆర్‌ పేర్కొంది. పోర్షే, జాగ్వార్‌, లంబోర్గినీ, లెక్సస్‌, ఆడి, ఎర్సిడెస్‌-బెంజ్‌, డీఎండబ్ల్యూ, బీఎండబ్ల్యూ 7 సిరీస్‌, ఫోర్డ్‌, వోల్వో, టాయోటా, మారుతీ సుజుకీ లాంటి కంపెనీలకు చెందిన అత్యాధునిక లగ్జరీ కార్లను అద్దెకు ఇస్తోంది. ఈ కార్లను అద్దెకు తీసుకున్నవారు వాటిని తామే సొంతంగా నడుపుకోవచ్చు. లేదా డ్రైవర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.  అయితే శంషాబాద్  అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడానికి ముందు వీటిని బుక్‌ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల భద్రత కోసం ప్రతి ట్రిప్‌ తర్వాత కార్లను శానిటైజ్‌ చేస్తారని తెలిపింది.

ఇవీ చదవండి: Minister KTR: మున్సిపల్ సిబ్బందికి సెలవులు రద్దు.. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం

Coronavirus: కరోనా వైరస్ వ్యాప్తి.. సంచలన విషయాలు వెల్లడించిన సీసీబీఎం సీఈఓ మధుసూదన రావు..