Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణ పరిస్థితులు.. భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు..

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఒక్కసారిగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు కాస్త కూల్ వాతావరణ కనిపించినా..

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణ పరిస్థితులు.. భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు..
Heat Waves
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 18, 2021 | 8:44 AM

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఒక్కసారిగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు కాస్త కూల్ వాతావరణ కనిపించినా.. మళ్లీ ఎండలు పెరుగుతున్నాయి. శనివారం పగటిపూట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరాయి. ఇలా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరడగానికి కారణం దక్షిణ ఒడిశా ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం బలహీనపడటమే అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉపరితల ఆవర్తనం బలహీన పడటం వలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పగిటిపూట ఊష్ణోగ్రతలు పెరుగుతాయన్నారు. నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందంటున్నారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే కూడా 2-3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అధికారులు చెబుతున్నారు. రానున్న మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోనూ పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందన్నారు. కాగా, ఉపరితల ఆవర్తనం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు కురిశాయి. ఇప్పుడు ఉపరితల ఆవర్తం బలహీనపడటంతో వాతావరణం మళ్లీ వెడెక్కుతోంది.

ఇదిలాఉండగా.. తెలంగాణ కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరిమెరిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కనిష్ఠంగా 19.3 డిగ్రీల నుంచి 25.8చ డిగ్రీల మధ్య రికార్డ్ అయ్యాయి. ఇక శనివారం నాడు కుమ్రంభీ ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో నాలుగు చోట్ల చిరు జల్లులు కురిశాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే.. మరికొన్ని ప్రాంతాల్లో వాతావరణం కూల్‌గా ఉంది. ఇంకా విచిత్రంగా విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతంలో పొగ మంచు కురుస్తోంది. తెల్లవారుజామున 7 గంటల వరకు పొగ మంచు కమ్మేస్తొంది. ఈ వాతావరణాన్ని అక్కడి ప్రజలు, పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు.

Also read:

Bank Timings: పెరుగుతున్న కరోనా కేసులు.. బ్యాంకు ఉద్యోగులపై ఎఫెక్ట్‌… బ్యాంకుల పని వేళల్లో మార్పులు..?

Medical Oxygen: ఆదుకుంటాం.. ఆక్సిజన్ కొరతపై స్పందించిన కేంద్ర ఆరోగ్యమంత్రి హర్ష వర్ధన్.. ఏమన్నారంటే?

నిజంగానే ఏలియన్స్‌ ఉన్నాయా…? ఈ వీడియోలో కనిపిస్తుంది నిజమేనా..?.. అమెరికా నుంచి వీడియో విడుదల